నా కొడుకు నుండి ప్రాణ హాని ఉంది.. రివాలర్వ్‌తో బెదిరిస్తున్నాడు

నా కొడుకు నుండి ప్రాణ హాని ఉంది.. రివాలర్వ్‌తో బెదిరిస్తున్నాడు

బంజారాహిల్స్ : హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో క‌ల‌క‌లం సృష్టించిన రూ.100 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్స్, గన్ చోరీ కేసులో మ‌రో కొత్త విషయం బ‌య‌ట‌పడింది. ఈ వ్య‌వ‌హారంలో నిందితుడిగా అనుమానిస్తున్న సుధర్ రెడ్డి తల్లి అజంతా సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నాడు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ.. బంజారాహిల్స్‌లోని తన ఇంటి నుంచి రివాల్వర్, 100 కోట్లు విలువ చేస్ డాక్యుమెంట్లను కుమారుడు సుదీర్ ఎత్తు కెళ్లాడని ఆరోపించారు. 30 కోట్లు విలువ చేసే ఇళ్లను తన పేరు మీద రాయాలని రివాలర్వ్‌తో తనని బెదిరిస్తున్నాడని చెప్పారు.

“30 కోట్లు విలువ చేసే ఇల్లును తన పేరు మీద రాయాలని రివాలర్వ్ తో తనని బెదిరిస్తున్నాడు. నాపైన రివాలర్వ్ ఎక్కు పెట్టి చంపుతాను అంటూ బెదిరింపులు దిగాడు. నా భర్త చనిపోక ముందే 30 కోట్లు ఇల్లు నా పేరు మీద రాశారు. ఆ ఇల్లు సుదీర్ రెడ్డికి ఇవ్వలేదని ఇంట్లో బంధించి కుక్కలను వదలి భయాందోళనకు గురి చేస్తున్నాడు. విదేశాల నుంచి అక్రమంగా ఆయుధాలు తీసుకొచ్చి ఇంట్లో భద్ర పరిచాడు. ఈ విషయం పై ఎన్నో సార్లు నిలదీసినా అలాగే ఎనిమిది తుపాకులు భద్రపరిచాడు. ఈ విషయంలో మనోవేదన చెందే నా భర్త చనిపోయాడు. నా కుమారుడు నుండి నాకు ప్రాణ హాని ఉంది. నాలుగు రోజులు క్రితమే డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశాను. నేను వేధిస్తున్నట్లు నా పైనా, నా కూతుళ్లపై.. కోడలు, కొడుకు కేసు పెట్టారని తెలిసింది. నా మీద ఉన్న ఆస్తి మొత్తం రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి రాశిస్తున్నాను. నీకు ఇష్టమైన వారితోనే నేను నిన్ను కాల్చి చంపిస్తా అంటూ వేధిస్తున్నాడు. పోలీసులు నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను” అని అజంతా మీడియాకు వెల్లడించారు.