ఖైరతాబాద్ సర్కిల్-లో జీహెచ్ఎంసీ కార్మికురాలిపై కుక్క దాడి

ఖైరతాబాద్ సర్కిల్-లో జీహెచ్ఎంసీ కార్మికురాలిపై కుక్క దాడి

హైదరాబాద్, వెలుగు : ఖైరతాబాద్ సర్కిల్-లో జీహెచ్ఎంసీ కార్మికురాలిపై కుక్క దాడి చేసింది. సోమవారం ఉదయం ఆనంద్ బాగ్-లోని ఇంటెలిజెన్స్ ​ఆఫీసు ఎదుట రోడ్డు ఊడుస్తున్న రామేశ్వరి కాలును కరిచింది. దీంతో కింద పడిపోగా.. బాధితురాలి చెవిని కొరికి పట్టుకొని ఆమెను కొద్ది దూరం లాక్కెళ్లింది. గమనించిన తోటి కార్మికులు కుక్కలను తరిమేశారు. వెంటనే బాధితురాలిని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. కుక్క కాటుకి గురైన కార్మికురాలిని ఆదుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.