సత్యమాంబ బ్రహ్మోత్సవాల్లో కుక్కల పరుగు పోటీ

సత్యమాంబ బ్రహ్మోత్సవాల్లో  కుక్కల పరుగు పోటీ

మండలంలోని చిన్నతాండ్రపాడులో సత్యమాంబ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం కుక్కల పరుగు పోటీలు నిర్వహించారు. పోటీలను కాంగ్రెస్  పార్టీ గట్టు మండల అధ్యక్షుడు తుమ్మలపల్లె రవినాయుడు ప్రారంభించారు. ఉత్కంఠ భరితంగా సాగిన  పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ రూ.10 వేలు వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నరేశ్​కు చెందిన ఆర్వీ డాగ్ గెలుచుకుంది.సెకండ్ ప్రైజ్  రూ. 5 వేలు గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన  నరసింహులు లక్కీ డాగ్  గెలుచు కుంది.

థర్డ్ ప్రైజ్  రూ.3 వేలు గట్టు మండలం బల్గెర గ్రామానికి చెందిన ఆంజనేయులు లైగర్  డాగ్ గెలుచుకుంది. వారందరికీ ఆలయ కమిటీ సభ్యులు నగదు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు సత్యం, మహేశ్, దుల్లయ్య, మోహన్, తిమ్మప్ప పాల్గొన్నారు.