కుక్కలను ఇలా పెంచండి.. వాటి వల్ల అస్సలు ఇబ్బంది ఉండదు..!

కుక్కలను ఇలా పెంచండి.. వాటి వల్ల అస్సలు ఇబ్బంది ఉండదు..!

కుక్క పిల్నల్ని  ( పప్పీస్​) పెంచుకోవడం చాలామందికి ఇష్టం.   అయితే వాటిని పెంచడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. తిండి పెట్టడం, నిద్ర పుచ్చడం, వాటిని బయటికి తీసుకెళ్లడం వంటివి సరిగ్గా చేస్తేనే యజమానులకు కంఫర్ట్ గా ఉంటుంది. లేకపోతే, ఎప్పుడూ చిరాకే. అందుకే వాటికి సరైన లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే పప్సీస్​ ని  పెంచడం చాలా ఈజీ అని ఎక్స్​ పర్ట్స్​  అంటున్నారు. దాని కోసం వాళ్లు అందిస్తున్న కొన్ని సూచనలు ఇవి.

ఏ పెంపుడు కుక్కలైనా వాటికోసం ఇంట్లో కచ్చితంగా ప్రతేక స్పేస్ ఏర్పాటు చేయాలి. వీలుంటే మార్కెట్​ లో  కుక్కల కోసం దొరికే క్రేట్ వాడాలి. వాటిని వాడటాన్ని కూడా అలవాటు చేయాలి. అవి కంఫర్ట్ గా పడుకునేందుకు ఫోమ్ మ్యాటెస్ ఏర్పాటు చేయాలి. అవి ఆడుకోవడానికి టాయ్స్ దొరుకుతుంటాయి. వాటిని క్రేట్ ఉంచాలి. ఇంట్రెస్ట్​ ను  బట్టి ఫుడ్, నీళ్లు క్రేట్ లోపలే అందించొచ్చు. లేదా వేరే చోట అయినా సెట్ చేయొచ్చు. క్రేట్​ కు  డోర్ ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది.

బాత్రూమ్ రూల్స్

పప్పీల పెంపకంలో అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. వాటికి బాత్రూమ్ అలవాటు చేయడం. మల మూత్రాలు ఎక్కడ పోయాలో అలవాటు చేయాలి. రోజూ ఒక టైమ్ అలవాటయ్యేలా చూడాలి. 
ఏ టైంలో బాత్రూమ్​ కు  వెళ్లాలనుకున్నా దాని ప్లేస్​ కు  వెళ్లేలా అలవాటు చేయాలి. కుక్కల్ని ఇంటికి తెచ్చుకున్న మొదటి రోజు నుంచి ఇవి అలవాటు చేస్తే పెద్దగా అయిన తర్వాత కూడా అదే ఫాలో అవుతుంది. అయితే దీనికి చాలా టైమ్ పడుతుందని గుర్తుంచుకోవాలి. ఓపికగా, నెమ్మదిగా ఇవి అలవాటు చేయాలి.

సోషలైజింగ్

పప్పీస్​ ను సరదాగా బయటకు తీసుకెళ్తుంటారు. దగ్గరలోని స్టోర్​ కు , వెజిటబుల్ మార్కెట్. పార్క్స్​   వంటి ప్లేసెస్ కు  తీసుకెళ్లినప్పుడు అవి ఎలా ఉండాలో అలవాటు చేయాలి. చుట్టూ మనుషులు వెళ్తున్నప్పుడు... వేరే కుక్కలు కనిపిం చినప్పుడు అరవకుండా..  కరవడం లాంటివి చేయకుండా చూడాలి. మీ మాటల ద్వారా కంట్రోల్ అయ్యేలా చూడాలి. ప్రశాంతంగా, ని శ్శబ్దంగా ఉంటూ పరిసరాల్ని ఎంజాయ్ చేసేలా ట్రైన్ చేయాలి.

►ALSO READ | Good Health: డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏంతినాలి.. ఏం తినకూడదు..!

గొలుసులతో కుక్కల మెడకు పట్టీ కట్టి ఉంచినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతాయి. పట్టీ. గొలుసు ఉన్నప్పటికీ, అవి ఇబ్బంది పడకుండా, కంఫర్ట్ గా  కదిలేలా చూసుకోవాలి. పొరపాటున గొలుసు తెంచుకుని బయటకు వెళ్లినా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండేలా పప్పీని అదుపులో ఉంచుకోవాలి.

లాంగ్వేజ్

మీ లాంగ్వేజ్​ ను  అవి అర్ధం చేసుకునేలా తయారు చేయాలి. అవి మీరు ఎలా చెప్తే... అది పాటించేలా చూడాలి. సిట్ (కూర్చోవడం)... సైలెన్స్ (నిశ్శబ్దంగా ఉండటం), స్టే... కమ్ అండ్ గో వంటి వర్డ్స్ ను అలవాటు చేయాలి.

బైటింగ్

కుక్కలు కరవడం మాత్రమే కాదు.. కొన్నిసార్లు పక్కన కనిపించే ప్లాస్టిక్, లెదర్ వంటి వస్తువుల్ని కొరకడం, గోళ్లతో గీరడం చేస్తుంటాయి. ఇవి మంచి అలవాట్లు కాదు. అందువల్ల కుక్కలు ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయాలి. అవసరమైతే గట్టిగా అరిచి చెప్పినా పర్లేదు. మీ అరుపును అర్ధం చేసుకుని, అవి కొరకడం, గీరడం ఆపేసి దూరంగా వెళ్లాలి. ఇలా మీ మాటవిని ఆగిపోయిన ప్రతిసారీ దగ్గరకు తీసుకుని తల నిమరాలి. ఫుడ్, ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి, దాన్ని హ్యాపీగా ఉంచాలి. ఇలా చేస్తే అవి ఆ అలవాటును దూరం చేసుకుంటాయి.

హోమ్​ అలోన్​ 

కుక్కలను కొన్నిసార్లు ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్లాల్సి రావొచ్చు. అలాంటప్పుడు అవి చాలా ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి, వాటిని ముందుగానే ట్రైన్ చేయడం చాలా అవసరం. ఒంటరిగా ఉండటంతోపాటు, ఇండిపెండెంట్ ఉండటం కూడా నేర్పించాలి. అప్పుడప్పుడు వాటిని ఇంట్లోనే ఉంచి, బయట డోర్ పెట్టి ఐదు నిమిషాలయ్యాక తీయాలి. ఆ వెంటనే దానికో గిఫ్ట్ అందిస్తూ ఉండాలి. ఇలా నెమ్మదిగా టైమ్ పెంచుకుంటూ వెళ్లాలి. దీంతో ఎప్పుడైనా ఇంట్లో ఎవరూ లేకపోయినా  అవి ఉండగలుగుతాయి