ఇలా చేస్తే ఎండాకాలంలోనూ మీ చర్మం మెరుస్తుంది

ఇలా చేస్తే ఎండాకాలంలోనూ మీ చర్మం మెరుస్తుంది

జడలో గులాబీలు పెట్టుకుంటే, ఎంత అందంగా కనిపిస్తారో..అలాంటి గులాబీ రేకులు చర్మ సంరక్షణకు కూడా ఎంతగానో మేలు చేస్తాయి. గులాబీ రేకుల్ని చల్లని నీళ్లలో కాసేపు నానబెట్టాలి. తర్వాత వాటిని మెత్తగా గ్రైండ్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అప్పుడు ముఖం తాజాగా కనిపిస్తుంది. పొడి చర్మం గల వాళ్లకు గులాబీ రేకుల్లోని సహజమైన నూనెలు.. కావాల్సిన తేమను అందిస్తాయి. అలాగే గులాబీ రేకుల్ని మెత్తగా చేసి, కాచి చల్లార్చిన పాలు, తేనె కలిపిన మిశ్రమంతో ప్యాక్ వేసుకోవాలి.

ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కుంటే మృత కణాలు పోవటంతో పాటు ముఖ చర్మం ఎంతో మృదువుగా మారుతుంది. గులాబీ రేకుల్లో రోజ్ వాటర్, తేనె కలిపి గుజ్జుగా చేసుకొని ప్యాక్ వేసుకుంటే.. మొటిమల సమస్య పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎండకు చర్మం నల్లబడితే గులాబీ రేకుల్లో చందనం, నిమ్మరసం, పసుపు కలిపి ప్యాక్ వేసుకొంటే చర్మం మెరుస్తూ ఉంటుంది.