
కనుబొమలు కళ్ల అందాన్ని రెండింతలు చేస్తాయి. వంపు తిరిగి, గుండ్రంగా, కొంచెం పైకి లేదా నిటారుగా.. ఇలా ఏ ఆకారంలో ఉన్నా, కనుబొమలు ఒత్తుగా ఉంటే ఫేస్ మరింత అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కనుబొమలు నిండుగా, అందంగా కనిపించడానికి ఏం చేయాలంటే...ఇంటి వద్ద తయారుచేసుకున్న ఆయిల్ వాడాలి. ఆలివ్ ఆయిల్, ఆముదం నూనె, కొబ్బరి నూనె, బాదం నూనె... ఈ నూనెలన్నింటిని రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఒక గాజు బాటిల్లోకి తీసుకుని కలిపితే హోమ్మేడ్ ఐబ్రో ఆయిల్ రెడీ. ఈ ఆయిల్ని రోజూ కనుబొమలకి మసాజ్ చేస్తూ రాసు కోవాలి. నెల రోజులు ఇలా చేస్తే కను బొమలు నిండుగా కనిపిస్తాయి.