
హైదరాబాద్, వెలుగు: ఇన్నర్‌వేర్ కంపెనీ డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ‘రెయిన్‌గార్డ్’ కలెక్షన్ దుస్తులను ప్రవేశపెట్టింది. ఇవి వర్షం నుంచి రక్షణే కాకుండా, చూడటానికి ఎంతో అందంగా కూడా ఉంటాయని తెలిపింది.
ఈ కలెక్షన్లో స్మార్ట్ ట్రెంచ్ కోట్స్ నుంచి తేలికగా తీసుకెళ్లదగ్గ పొంచోలు, ప్యాంట్, షర్ట్ ఉన్నాయి. పురుషులు, మహిళలు, పిల్లలు అందరికి అనువైన దుస్తులు అందుబాటులో ఉన్నాయని డాలర్ పేర్కొంది. ఇవి దేశంలోని అన్ని రిటైల్ స్టోర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో రూ.199 నుంచి రూ.1599 వరకు ధరల్లో అందుబాటులో ఉంటాయి.