మళ్లీ కలిసిన ట్రంప్‌‌‌‌‌‌‌‌, మస్క్‌‌‌‌‌‌‌‌!..ఇద్దరూ కలిసి డిన్నర్‌‌‌‌‌‌‌‌.. ఫొటో వైరల్

మళ్లీ కలిసిన ట్రంప్‌‌‌‌‌‌‌‌, మస్క్‌‌‌‌‌‌‌‌!..ఇద్దరూ కలిసి డిన్నర్‌‌‌‌‌‌‌‌.. ఫొటో వైరల్

ఫ్లోరిడా: చాలారోజుల గ్యాప్‌‌‌‌‌‌‌‌ తర్వాత అమెరికా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ డొనాల్డ్‌‌‌‌‌‌‌‌ ట్రంప్, స్పేస్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ ఎలాన్‌‌‌‌‌‌‌‌ మస్క్‌‌‌‌‌‌‌‌ ఒకే వేదికపై కనిపించారు. వెనెజువెలా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ నికోలస్‌‌‌‌‌‌‌‌ మదురో అరెస్ట్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇద్దరూ కలిసి డిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఫొటో సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌ అవుతోంది. 

ఆదివారం రాత్రి ఫ్లోరిడాలోని ట్రంప్‌‌‌‌‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎ లాగో ఎస్టేట్​లో ఆయన ఇచ్చిన ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ డిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలో మస్క్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. ఈ డిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఫొటోను మస్క్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌లో షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

‘‘గత రాత్రి పోటస్‌‌‌‌‌‌‌‌, ఫ్లోటస్‌‌‌‌‌‌‌‌తో అద్భుతమైన విందు పార్టీ జరిగింది. 2026 ఏడాది అద్భుతంగా ఉండబోతోంది” అని మస్క్‌‌‌‌‌‌‌‌ ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ పార్టీలో అమెరికా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లేడీ మెలానియా ట్రంప్‌‌‌‌‌‌‌‌ కూడా ఉన్నారు.