డెడ్ ఎకానమీ కాదు.. డైనమిక్ ఎకానమీ!

డెడ్ ఎకానమీ కాదు..  డైనమిక్ ఎకానమీ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెడ్ ఎకానమీగా అభివర్ణించారు. కానీ అసలు కారణం వేరే ఉంది. అమెరికా తరఫున ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్​లో భాగంగా వ్యవసాయం, డెయిరీ, ఫిషరీస్ రంగాలను తెరవమని ఒత్తిడి వచ్చింది. ఇవన్నీ ప్రాథమిక రంగాలు - రైతులు, పాడి పరిశ్రమ, మత్స్యకారులు ఆధారపడిన జీవనాధారాలు. మోదీ ప్రభుత్వం మాత్రం వీటితో రాజీ పడకుండా, దేశ ప్రయోజనాల కోసం ఏ మూల్యం చెల్లించైనా కాపాడుతామని స్పష్టంగా చెప్పింది. దానికి ప్రతిస్పందనగానే ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్య చేసి, భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు విధించారు. కానీ అదే సమయంలో, 18 సంవత్సరాల తర్వాత అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ భారత సార్వభౌమ రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బీబీబీ మైనస్​ నుంచి బీబీబీ కి అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేసింది. ఇది ట్రంప్ వ్యాఖ్యలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఒకవైపు రాజకీయ విమర్శలు, మరోవైపు గ్లోబల్ మార్కెట్ల విశ్వాసం - ఈ రెండు పరిణామాలు భారత ఆర్థిక బలం ఎక్కడుందో స్పష్టంగా చూపుతున్నాయి. 

రిఫార్మ్ - పర్ఫార్మ్ - ట్రాన్స్​ఫార్మ్​తో అభివృద్ధి సాధ్యమని కాలం చెపుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. మూడో అతిపెద్ద ఎకానమీగా మారే దిశగా పరుగులు పెడుతోంది. ‘లోకల్ ఫర్ వోకల్’ నినాదంతో స్వయం సమృద్ధి వైపు భారత్​ వేగంగా వెళుతోంది.

 దశాబ్ద కాలంగా వేగంగా  అభివృద్ధి

2014లో కేవలం 5 నగరాల్లో మాత్రమే మెట్రో రైలు. నేడు 24 నగరాల్లో, 1000కి పైగా కి.మీ. నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్. రైల్వే విద్యుదీకరణ 20,000 కి.మీ. నుంచి 60,000 కి.మీ. పైగా పెరిగింది. విమానాశ్రయాలు 74 నుంచి 160 పైగా పెరిగాయి. జాతీయ జలమార్గాలు 3 నుంచి 30కి పెరిగాయి. జీడీపీ వృద్ధి - ప్రపంచంలో అగ్రగామి భారత్ - 7%+, అమెరికా - 2%, జర్మనీ,  ఫ్రాన్స్,  జపాన్ -1-2%,  చైనా - 4-5%.  భారత్​2014లో 11వ అతిపెద్ద ఎకానమీ,  ఇపుడు  4వ అతిపెద్ద ఎకానమీ. మరో 2 సంవత్సరాల్లో జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధిగమించి 3వ స్థానంలోకి భారత్ రాబోతున్నదని ఐఎంఎఫ్​ అంచనా. 

ద్రవ్యోల్బణ నియంత్రణ

 భారత్ - ద్రవ్యోల్బణం కేవలం 3%. అమెరికా/యూరప్ లది - 8-.10% ( కొవిడ్​ తర్వాత). ప్రజలకు స్థిరమైన ఆర్థిక వాతావరణం, అందుబాటు ధరలు. మేక్ ఇన్ ఇండియా - మొబైల్ విప్లవం. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్ముడయ్యే మొబైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 99% స్వదేశీ. 2023–-24లో మొబైల్ ఎగుమతులు 15 బిలియన్ డాలర్లు. ఆపిల్​, సామ్​సంగ్​, క్సియామీ వంటి దిగ్గజాలు భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మలుస్తున్నాయి. పీఎల్​ఐ స్కీమ్. ఎలక్ట్రానిక్స్, టెక్స్​టైల్స్, ఫార్మా, ఆటో రంగాల్లో పరిశ్రమలు. లక్షలాది ఉద్యోగాలు. గ్లోబల్ పెట్టుబడుల ఆకర్షణ. ఇంధన రంగం - కొత్త దిశ. ఈవీలు (ఫేమ్​ 1 - 2015, ఫేమ్​ 2, - 2019) - సబ్సిడీలు, ఛార్జింగ్, పరిశ్రమలకు ప్రోత్సాహం. ఎథనాల్ మిశ్రమం 1% నుండి 12%కి పెరిగి, లక్ష్యానికి 5 ఏళ్ళ ముందుగానే 20% సాధించింది. భారత్​ ఇప్పుడు 100% ఎనర్జీ సెక్యూరిటీ దిశగా దూసుకెళ్తోంది. పునరుత్పాదక ఇంధనాలతో భారత్​ 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యం చేరుకోనుంది. రక్షణ రంగం - ఆత్మనిర్భర్ భారత్ విజయాలను సాధించిపెడుతోంది. ఆపరేషన్ సిందూర్ - ఆధునిక స్వదేశీ టెక్నాలజీతో సైన్యం విజయం సాధించింది. స్వదేశీ డ్రోన్లు, మిసైళ్లు, యుద్ధ వాహనాలు - భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే తయారవుతున్నాయి. రక్షణ ఎగుమతులు రికార్డులు సాధిస్తున్నాయి. డిజిటల్ ఇండియా అండ్​ స్టార్ట్-అప్ ఇండియా. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1 లక్షకు పైగా స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు. యూపీఐ పేమెంట్స్ - ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఐటీ అండ్​ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఎగుమతులు వందల బిలియన్ల డాలర్లు దాటాయి. 

ట్రంప్​ బెదిరింపు రాజకీయం!

అన్ని రంగాలలో భారత అభివృద్ధిని చూసి వ్యాపార వాణిజ్య భాగస్వామ్యం కోసం బెదిరింపు రాజకీయాలకు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నించడం దిక్కుమాలిన చర్య.  చివరికి మరింత ముఖ్యమైంది ఏమిటంటే, ట్రంప్​   కోరిన అగ్రిమెంట్​ ఏమిటంటే, భారత వ్యవసాయం, డెయిరీ, ఫిషరీస్ రంగాలను  తెరవాలని. కానీ భారత్​ అందుకు అంగీకరించక పోవడం వల్లే ట్రంప్​  భారత్​ది ‘డెడ్​ ఎకానమీ’ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. గుడ్డిగా మన వ్యవసాయాన్ని అమెరికాకు అప్పగించి కోట్లాది ప్రజల జీవనాధారాన్ని పరాయివాళ్ల చేతిలో పెట్టలేం. వాస్తవానికి   ​ ‘రైతులు, మత్స్యకారులు, డెయిరీ రంగం బలపడితేనే భారత్ వికసిస్తుంది. 140 కోట్ల భారతీయులు ఏకమైతే వికసిత్ భారత్ సాధ్యమే. ఆర్థికంగా దేశం ఇలాగే పుంజుకుంటూ పోతే భారత్​2047 నాటికి - 100వ స్వాతం త్ర్య దినోత్సవానికి - ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం అసాధ్యమేమీ కాదు.

ముగింపు

ట్రంప్ చెప్పినట్టు మనది ‘డెడ్ ఎకానమీ’  కాదు.డైనమిక్​ ఎకానమీ. ప్రస్తుతం భారత జీడీపీ వృద్ధి 7% కంటే ఎక్కువ, ద్రవ్యోల్బణం కేవలం 3%, మేక్ ఇన్ ఇండియా విజయాలు, ఎథనాల్ 20% లక్ష్యం, రక్షణ రంగంలోని ఆపరేషన్ సిందూర్ విజయాలు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డిజిటల్ ఇండియా - ఇవన్నీ కలిపి  భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వైపు నడిపిస్తున్నాయి.

- బీరప్ప బేజాడి,
చార్టెడ్​ అకౌంటెంట్