వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైట్‌హౌస్ ప్రకటించింది. ట్రంప్ మానసిక స్థితి, అతని పూర్తి ఆరోగ్యంపై డెమోక్రాట్ నేతలు ఇటీవల పలు ప్రశ్నలు లేవనెత్తడంతో అతని మెడికల్ రిపోర్టులను బహిర్గతం చేయాలనే ఒత్తిడి పెరిగింది. మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌తో సహా పలువురు డెమోక్రాట్ నేతలు ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేశారు.
ఈ వేసవిలో ట్రంప్ కాళ్లలో వాపు, కుడిచేతి వెనుక భాగంలో గాయాలు కనిపించడంతో ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇటీవల ఏ శరీర భాగాన్ని స్కాన్ చేశారని మీడియా అడగగా ట్రంప్ స్పష్టంగా చెప్పలేదు. దీంతో అనారోగ్య ఊహాగానాలు బలపడ్డాయి. ఆ టైంలో ట్రంప్ మాట్లాడుతూ. “ఇది కేవలం ఒక ఎమ్‌ఆర్‌ఐ మాత్రమే. మెదడుకు తీసింది కాదు. కాగ్నిటివ్ టెస్ట్‌లో నేను పాసయ్యాను” అని తెలిపారు.
