కరోనా మరణాలు పెరిగే చాన్స్ ఉంది

కరోనా మరణాలు పెరిగే చాన్స్ ఉంది
  • అయినా ఆంక్షల సడలింపు కొనసాగుతుందన్న ట్రంప్

వాషింగ్టన్ : అమెరికాలో ఆంక్షలు సడలిస్తే కరోనా మరణాలు పెరిగే చాన్స్ ఉందని ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. అయిన సరే అమెరికాలో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో చాలా చోట్ల లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేయటంతో తిరిగి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో కరోనా కేసులు, మరణాలు పెరిగే చాన్స్ ఉంది కదా అని మీడియా ప్రశ్నించగా అందుకు ట్రంప్ అవును అంటూ సమాధానం ఇచ్చారు. ” లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేస్తే మరణాలు పెరిగే చాన్స్ ఉంది. ఐతే మనం అపార్ట్ మెంట్లోనో, ఇంట్లోనో లాక్ చేసుకుని ఉండలేం కదా. ఆర్థిక వ్యవస్థ కూడా మళ్లీ సెట్ అవ్వాల్సిన అవసరముంది” అని చెప్పారు. అమెరికాలో లాక్ డౌన్ మొదలైన తర్వాత తొలిసారిగా ఆయన అరిజోనాలోని హనీవెల్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాస్క్ ధరించలేదు. ఆయనకు మాస్క్ ఇచ్చేందుకు ఫ్యాక్టరీ సిబ్బంది ప్రయత్నించగా వద్దన్నారు. ఆ చర్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధ్యయుతమైన పదవి లో ఉన్న వారే ఇలా ప్రవర్తిస్తే జనానికి తప్పుడు సమాచారం వెళ్తుందని విమర్శించారు. ఐతే ట్రంప్ మాత్రం మొదటి నుంచి మాస్క్ వేసుకోవటానికి ఇష్టపడటం లేదు. వైట్ హౌజ్ అధికారులు మాత్రం ట్రంప్ తరుచూ కరోనా టెస్ట్ లు చేయించుకుంటున్నందున పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.