WHOపై ట్రంప్ విమర్శలు

WHOపై ట్రంప్ విమర్శలు

మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న క్ర‌మంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తీరును విమర్శించారు. కరోనా విషయంలో WHO చైనాను వెనకేసుకొస్తోందని.. ఇది నిజంగా విచారించదగ్గ విషయం అన్నారు. చైనాలోని వుహాన్‌ పట్టణంలో తొలిసారిగా ప్రాణాంతక కరోనా వైరస్‌ బయటపడిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో మహమ్మారి పుట్టుకకు చైనీయుల ఆహారపు అలవాట్లే కారణమని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా వ్యాప్తికి చైనానే కారణమంటూ విమర్శలు గుప్పించింది కరోనాను చైనీస్‌ వైరస్‌ అంటూ ట్రంప్‌ మాటల యుద్దానికి తెరతీశారు. ఈ క్రమంలో చైనా సైతం అమెరికాకు గట్టిగానే బదులిచ్చింది. అమెరికా సైనికులే కరోనా వైరస్‌ను వుహాన్‌కు తీసుకువచ్చారని ఎదురుదాడికి దిగిన విష‌యం తెలిసిందే.