ఢిల్లీలో ట్రంప్ నేటి షెడ్యూల్ ఇదే..

ఢిల్లీలో ట్రంప్ నేటి  షెడ్యూల్ ఇదే..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు లంచ్ తర్వాత ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులతో సమావేశమవుతారు  ఆ తర్వాత భార్య మెలానియాతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో కలిసి రాజ్ ఘాట్‌లో గాంధీ సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి ట్రంప్ నేరుగా హైదరాబాద్ హౌస్ చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోడీతో కలిసి ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. పలు అంశాలకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలపై కీలక చర్చలు జరగనున్నాయి. చర్చలు ముగిసిన తర్వాత.. మోడీ-ట్రంప్ ఇద్దరూ కలసి జాయింట్ ప్రెస్‌మీట్ ఉంటుంది. ఆ సమయంలో ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ స్కూల్‌ను సందర్శిస్తారు. ప్రెస్‌మీట్ తర్వాత ట్రంప్ దంపతులు రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొంటారు. విందు తర్వాత ట్రంప్ ఫ్యామిలీ తిరిగి హోటల్ మౌర్యకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లి రాత్రి 10 గంటలకు అమెరికాకు బయలుదేరుతారు.

For More News..

తొలి 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా..

జమ్మూ కశ్మీర్‌లో మార్చి 4 వరకు ఇంటర్‌నెట్ సేవలు బంద్