ది అమెరికన్ నీరో.. ట్విట్టర్లో ట్రెండింగ్ గా ట్రంప్ ఫోటో

ది అమెరికన్ నీరో.. ట్విట్టర్లో ట్రెండింగ్ గా ట్రంప్ ఫోటో

వాషింగ్టన్ : అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో మరోసారి ట్రెండింగ్ గా మారారు. వయోలిన్ వాయిస్తూ , తన్మయత్వంతో కళ్లు మూసుకున్న ఫొటోను ట్వీట్ చేస్తూ .. ‘దీనర్థం ఎవరికి తెలుసు? ఆ సౌండ్ మాత్రం వినడానికి బాగుంది’అని అన్నారు. దీంతో ఆయన ఫాలోవర్లు, విమర్శకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ట్రంప్ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ,నీరో చక్రవర్తి ఫొటోలు పెట్టి ట్వీట్లు చేశారు. ట్రంప్ ట్వీట్ కు కామెంట్లు వెల్లువెత్తాయి .జనరల్ నాలెడ్జ్​లో ట్రంప్ అంతంత మాత్రమేనని, నీరో చక్రవర్తి ఎవరో తెలియదని, చరిత్ర చదువుకుంటే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు ఆయనకు సలహా ఇచ్చారు. మొన్నటి ఆదివారం ఎవరో చేసిన ఈ ట్వీట్ మంగళవారం నుంచి ట్రెండింగ్ గా మారింది. అమెరికాలో కరోనా క్రైసిస్ మొదలయ్యాక ఈ ట్వీట్వైరల్ గా మారింది. అయితే, ‘ది అమెరికన్నీరో’ పేరుతో తనపై రాసిన బుక్ ప్రచారంలో భాగంగానే ట్రంప్ ఈ ట్వీట్ చేశారని తర్వాత బయటపడింది.