ఇంటి కుక్కలతో ఇలా ఉండొద్దు.. ఆ తర్వాత బాధపడతారు..

ఇంటి కుక్కలతో ఇలా ఉండొద్దు.. ఆ తర్వాత బాధపడతారు..

సోషల్ మీడియాలో పెట్స్ ఫన్నీ వీడియోలు చూసి తెగ నవ్వుకుంటాం. కానీ, ఫన్నీ వీడియోల కోసం పెట్స్ని భయపెట్టడం, వాటితో కన్నింగ్గా ఉండడం కరెక్ట్ కాదు. ఆ వీడియోలు పెంపుడు జంతువుల మీద నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయని అంటున్నారు పెట్ లవర్స్. "మనుషుల లెక్కనే ప్రతి జంతువు కూడా దేనికది ప్రత్యేకమైనది. వాటిని వీడియోలు తీయడం వల్ల కొన్ని షాక్ లోకి వెళతాయి, గాయపడతాయి. పెట్స కి మనుషుల మీద నమ్మకం పోతుంది. వాటిని భయపెడుతూ ఫన్నీ వీడియోలు తీయడం ఎంటర్ టైన్మెంట్ కానే కాదు" అంటోంది యానిమల్ కమ్యూనికేటర్ అక్షయ కావే.

హింస లాంటిదే

పెట్స్కీ ఇష్టమైన ఆటబొమ్మల్ని తన్నడం, విసిరేయడం సరదా అనుకుంటారు కొందరు. అలా చేయడం పెట్స్ ని బాధిస్తుందట. తమని కూడా అలా తన్నుతారేమో. విసిరేస్తారేమో అని అవి అనుకుంటాయట. పెట్స్ని భయపెట్టి, షాక్ కి గురిచేసి ఆనందించాలని ఏ పెట్ లవర్ కోరుకోడు. 'కత్తులు, ఇతర వస్తువులు చూపించి పెట్స్తో ఫన్నీ.. వీడియోలు తీయడం ఒకరకంగా వాటిని హింసించడం లాంటిదే' అంటున్నారు యానిమల్ యాక్టివిస్టులు.

పాజిటివ్ గా మెలగాలి

మనలాగే పెట్ కి ఫీలింగ్స్ ఉంటాయి. వాటితో పాజిటివ్ గా, ఫ్రెండ్గా ఉండాలి. పెంపుడు జంతువులకి ఇష్టమైన యాక్టివిటీస్ తెలుసుకోవాలి. వాటికి నచ్చిన పనులు చేసి వాటిలో పాజిటివ్ నెస్ నింపాలి. అంతేతప్ప పెట్స్ని దారిలోకి తేవాలి అనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు.