
- అన్ని పార్టీల నేతలు సహకరించాలి
- మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్
శామీర్ పేట, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ఉల్లంఘించకుండా జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని మేడ్చల్కలెక్టర్అమోయ్కుమార్ కోరారు. మంగళవారం అంతాయిపల్లిలోని కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఎన్నికల నియమావళి తదితర అంశాలపై మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల నేతలు నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించారు. జిల్లాలో ప్రత్యేక టీమ్ పర్యటిస్తుందని, ఇందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు. రాజకీయ పార్టీల నేతలు పలు సందేహాలను వ్యక్తం చేయగా కలెక్టర్ నివృత్తి చేశారు. సీ–విజిల్‌యాప్‌ను వినియోగించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవల్ఏజెంట్లను నియమించుకోవాల్సిందిగా సూచించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని తెలిపారు.
ఎన్నికల రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు
రంగారెడ్డి కలెక్టరేట్: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, భారీగా మద్యం, నగదు నిల్వలపై నిఘా పెట్టాలని నోడల్ అధికారులను రంగారెడ్డి కలెక్టర్ హరీశ్ఆదేశించారు. మంగళవారం కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, అబ్జర్వర్ల నియామకాలకు తగిన సిబ్బందిని గుర్తిస్తూ, ర్యాండమైజేషన్ ద్వారా తీసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్, కౌంటింగ్ డ్యూటీలకు వేర్వేరుగా సిబ్బందిని నియమిస్తూ, వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు.