బిడ్డా.. ఆఫ్ఘన్ల ధైర్యాన్ని పరీక్షించొద్దు: భారత్ గడ్డ నుంచి పాక్‎కు తాలిబన్ మంత్రి వార్నింగ్

బిడ్డా.. ఆఫ్ఘన్ల ధైర్యాన్ని పరీక్షించొద్దు: భారత్ గడ్డ నుంచి పాక్‎కు తాలిబన్ మంత్రి వార్నింగ్

న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న ఆప్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పాకిస్తాన్‎కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఆప్ఘానిస్తాన్‎లో పాక్ దాడిని ఉద్దేశిస్తూ.. ఆఫ్ఘన్ల ధైర్యాన్ని పరీక్షించొద్దని భారత గడ్డ మీదనుంచి పాక్‎కు హెచ్చరికలు పంపారు. ఇండియా పర్యటనలో ఉన్న ముత్తాకి శుక్రవారం (అక్టోబర్ 10) ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‎తో భేటీ అయ్యారు. 

ఈ సమావేశంలో ఇండియా ఆప్ఘాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, కాబూల్‌లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించడం గురించి చర్చించారు. అలాగే.. ప్రపంచానికి సవాల్‎గా మారిన ఉగ్రవాదం గురించి ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సుదీర్ఘంగా డిస్కస్ చేశారు. అనంతరం ముత్తాకి మీడియాతో మాట్లాడారు. 

పాకిస్తాన్‎ను ఉద్దేశిస్తూ.. ఆఫ్ఘన్ గడ్డను ఉగ్రవాదం కోసం ఏ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి అనుమతించమని ఇండియాకు హామీ ఇచ్చారు. ఆప్ఘాన్ రాజధాని కాబూల్‌లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల పాక్ చేసిన దాడులపైన ముత్తాకి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

►ALSO READ | పాపం ట్రంప్..ఏడు యుద్ధాలు ఆపినా నోబెల్ రాలె!!

 ‘‘ఈ విధానం ద్వారా సమస్యలను పరిష్కరించలేమని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్‌లో పాక్ చర్యను ఖండిస్తున్నాము. ఆఫ్ఘన్ ప్రజల సహనం, ధైర్యాన్ని సవాల్ చేయకండి. బ్రిటిష్, సోవియట్ యూనియన్,  అమెరికన్ల నుంచి పాక్ చారిత్రక పాఠాలను గుర్తుంచుకోవాలి’’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ముత్తాకి. 

40 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ శాంతి, పురోగతిని సాధించిందని.. అన్ని దేశాలతో శాంతియుత సంబంధాలను కలిగి ఉండాలని ఆఫ్ఘనిస్తాన్ కోరుకుంటుందని తెలిపారు. ఏకపక్ష విధానంతో శాంతిని సాధించలేమని ఆయన హితవు పలికారు. ఈ సమావేశం అనంతరం.. కాబూల్‌లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభిస్తుందని మంత్రి జైశంకర్ వెల్లడించారు.