తాగుతూ ఫోన్‌‌ వాడొద్దు : ఇదో కొత్త రకం అడ్వైస్‌‌

తాగుతూ ఫోన్‌‌ వాడొద్దు : ఇదో కొత్త రకం అడ్వైస్‌‌

డోంట్‌‌ డ్రింక్‌‌ అండ్‌‌ డ్రైవ్‌‌ (తాగి బండ్లు నడపొద్దు) బోర్డులు కామన్‌‌గా చూస్తుంటాం. కానీ జమ్మూ కాశ్మీర్‌‌ పోలీసులు మాత్రం వెరైటీగా ‘తాగుతూ ఫోన్లు వాడొద్దు’ అని బోర్డులు పెట్టారు. జమ్మూ జిల్లాలోని పీర్‌‌కీ గలిలో మొఘల్‌‌ రోడ్డు ప్రాంతంలో ఈ బోర్డును ఏర్పాటు చేశారు.  కొందరు దాన్ని ఫొటో తీసి సోషల్‌‌ మీడియాలో పెట్టారు. వైరలైంది. ఫొటోపై ఆ రాష్ట్ర మాజీ సీఎం స్పందించారు. ‘ఇంతవరకు తాగి బండ్లు నడపొద్దు. బండ్లు నడిపేటప్పుడు ఫోన్‌‌ వాడొద్దనే సైన్‌‌ బోర్డులను చూశాం.

ఇదో కొత్త రకం అడ్వైస్‌‌’ అని ఒమర్‌‌ అబ్దుల్లా ట్వీట్‌‌ చేశారు. ఇంకొందరేమో.. ‘తాగి బోర్డులు రాయొద్దు’ అని, ‘చాలా మంది తాగాక ఫోన్‌‌ బాగా వాడుతుంటారు. వాళ్లను ఆపడం కష్టమే’ అని ఫన్నీగా కామెంట్లు చేశారు. ఫొటో బాగా వైరలవడంతో అధికారులు స్పందించారు. అది డ్రింకింగ్‌‌ కాదని డ్రైవింగ్‌‌ అని క్లారిటీ ఇచ్చారు. ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు.