నిన్ను దించే టైం వచ్చింది కేసీఆర్..తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది

నిన్ను దించే టైం వచ్చింది కేసీఆర్..తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది

కొత్త సచివాలయ నిర్మాణ వ్యయం రూ. 600 కోట్ల నుంచి 1600 కోట్లకు పెరిగినప్పుడు..పేదల ఇళ్ల పథకానికిచ్చే డబ్బులు 5 లక్షల నుంచి 3 లక్షలకు ఎందుకు తగ్గించారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.  తెలంగాణలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వనపర్తిలో  నిరంజన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా  ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. కేసీఆర్ , నిరంజన్ రెడ్డి వేల పుస్తకాలు చదివిన గొప్ప మేధావులని చురకలంటించారు. రాష్ట్రంలో ప్లానింగ్ బోర్డు, పథకాల అమలు  మూసపద్దతిలో నడుస్తున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ మానిఫెస్టో భగవద్గీత, ఖురాన్  అన్నారని...మరి ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. .కొత్త సచివాలయం 600 కోట్ల నుంచి 1600 కోట్లైంది.పేదల ఇళ్లు 5 లక్షల నుంచి 3 లక్షలకు ఎందుకు తగ్గింది.  సేవ్ వనపర్తి పేరుతో వనపర్తిలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. 


నిరంజన్ రెడ్డి గతిలేక 2001 లో టీఆర్ఎస్ లో చేరారని జూపల్లి కృష్ణారావు విమర్శించారు.  కేసు గెలవటానికి , ఓడిపోవటానికి డబ్బులు తీసుకునే ఏకైక వకీల్ సాబ్ నిరంజన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఎన్నికలలోపు ప్రతి దళితునికి రూ. 10 లక్షలు ఇవ్వకపోతే నిరంజన్ రెడ్డిని గ్రామాల్లో తిరగనివ్వొద్దని పిలుపునిచ్చారు. వనపర్తిలో ఓట్లడిగే నైతిక హక్కు మంత్రి నిరంజన్ రెడ్డికి లేదన్నారు. నిరంజన్ రెడ్డి మంత్రి అవడంలో తన పాత్ర ఉందని... పాలమూరు జిల్లాలో  14  నియోజకవర్గాలు గెలిపించాలని తాను చూస్తే..తననే ఓడించాలని చూశారని మండిపడ్డారు. రూ. 35 లక్షల సొంత ఖర్చులో అమరవీరుల స్థూపం కట్టానన్నారు.  తాను   ఏనాడూ ఎవరికి తలవంచలేదని...తాను ఉద్యమకారుణ్ణి అని చెప్పారు. ఉచిత కరెంటు ఇవ్వటంలో తన పాత్ర ఉందన్నారు.