
కోల్‌కతా: బెంగాల్‌ను 34 ఏళ్లపాటు ఏలిన లెఫ్ట్ ఫ్రంట్ ఇప్పుడు చతికిలపడిపోయింది. రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. ఈ విషయంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందించారు. లెఫ్ట్ ఫ్రంట్‌ను తాను వ్యతిరేకించినప్పుటికీ వారు ఒక్క సీటూ నెగ్గకపోవడం తనను నిరారశపర్చిందని దీదీ అన్నారు. బీజేపీ గెల్చిన చోట్లలో లెఫ్ట్ ఫ్రంట్ నెగ్గి ఉంటే తాను బాగుండేదన్నారు. తృణమూల్ పార్టీ మీద అతిగా ఈర్ష్య పెంచుకోవడం లెఫ్ట్ ఫ్రంట్‌కు చేటు చేసిందని, అది బీజేపీకి అనుకూలించిందన్నారు. లెఫ్ట్ నేతలు అమ్ముడుపోయారని, ఇప్పుడు వాళ్లు సైన్‌బోర్డులుగా మిగిలారని విమర్శించారు. ఇప్పటికైనా లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు పార్టీ భవిష్యత్‌పై పునరాలోచించుకోవాలని సూచించారు.