కేంద్రం కాళ్లపై పడేందుకూ సిద్ధమే

కేంద్రం కాళ్లపై పడేందుకూ సిద్ధమే

న్యూఢిల్లీ: నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (ఎన్‌సీటీ) బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌‌జీ)కి ప్రత్యేక అధికారాలు కల్పించే ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఎల్‌‌జీకి అపరిమిత అధికారాలిచ్చే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ఢిల్లీ సీఎం ఎక్కడకు వెళ్లాలని క్వశ్చన్ చేశారు. 

ఎన్నికలకు, ఓట్లకు, తాము గెల్చుకున్న 62 స్థానాలకు అర్థం లేదా అని కేజ్రీ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘ప్రజాధికారాలను నాశనం చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ బిల్లు ప్రకారం అన్ని ఫైళ్లను ఎల్‌జీ అప్రూవల్ కోసం పంపాల్సి ఉంటుంది. మా అధికారాలను లాక్కుంటే కేంద్రం కాళ్లపై పడి ప్రార్థించడానికీ రెడీ. ఢిల్లీ అభివృద్ధి సందిగ్ధంలో పడుతుందేమోనని భయమేస్తోంది’ అని కేజ్రీవాల్ చెప్పారు.