డోర్ స్టెప్ డీజిల్ డెలివరీ స్టార్టప్స్‌కు ఆయిల్ కంపెనీలు సై

డోర్ స్టెప్ డీజిల్ డెలివరీ స్టార్టప్స్‌కు ఆయిల్ కంపెనీలు సై

న్యూఢిల్లీ: డోర్‌‌ స్టెప్ డెలివరీస్‌ కోసం స్టార్టప్‌లను పెంచే యత్నంలో దేశీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యత్నిస్తున్నాయి. తద్వారా ఇండియాలో డోర్ స్టెప్ డీజిల్ డెలివరీ పెద్ద మార్కెట్‌ను క్రియేట్‌ చేయాలని ప్లాన్స్‌ చేస్తున్నట్లు తెలిసింది. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లు హై స్పీడ్ డీజిల్‌ను డోర్‌‌ స్టెప్ డెలివరీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలో హోం డెలివరీ చేస్తున్న పలు కంపెనీలు ఉన్నాయి. వాటిలో ఫ్యుయల్ బడ్డీ, రెపోస్ ఎనర్జీ, పెప్‌ ఫ్యుయల్స్, మై పెట్రోల్ పంప్‌తోపాటు హమ్ సఫర్ లాంటి ఫిర్మ్స్ ఉన్నాయి. ‘ఫ్యుయల్ డెలివరీ చేయడానికి ఆసక్తి కలిగిన సుమారు 30 వేల ఎంటర్‌‌ప్రెన్యూర్స్‌ ఫ్యుయల్ ఎంట్స్‌ రిజిస్టర్ చేసుకున్నారు. దీని కోసం రూ.9 వేల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ క్లౌడ్ ప్రపోజిషన్ అనుకుంటున్నాం’ అని రెపోస్ ఎనర్జీ సీఈవో చెరన్ వాలున్జ్ చెప్పారు. రెపోస్ ఎనర్జీకి రతన్ టాటా అండగా నిలిచిన సంగతి తెలిసిందే.