ప్లాంక్స్ చేస్తే పొట్ట పోతది

ప్లాంక్స్ చేస్తే పొట్ట పోతది

‘ఏ పనీ చేయకుండా కూసోని తింటే కొండలైనా కరిగిపోతయ్‌’ అంటరు. అట్లనే, రోజూ ఏ ఎక్సర్‌‌సైజ్‌ చేయకుండా కూసోని తింటే, పొట్ట కొండలెక్క తయారైతది! పొట్ట కొండలెక్క అయ్యేకొద్దీ ఆయాసం పెరుగుతది. ఆ పొట్టను మోయలేక శరీరం వీక్‌ అయితది. చివరికి లేనిపోని.. జబ్బులకు నీడనిస్తది!  చానామంది ‘పొట్ట తగ్గియ్యాలె.. వాకింగ్‌కి పోవాలె’ అని రోజూ మస్తు ముచ్చట్లు చెప్తుంటరు. కానీ, అది మునువెళ్లదు. పొద్దుగాల గడప దాటి అడుగు బయటపెట్టనోళ్లు మస్తుమంది ఉంటరు. ఇట్లాంటోళ్లందరూ ఇంట్లనే పొట్ట కరిగించుకునే ఎక్సర్‌‌సైజ్‌లు ఇవి!

ఈ లోకంలో అన్నింటికంటే గొప్ప సంపద ఏంటి? అంటే ఆరోగ్యమైన శరీరం. దాని వెల కట్టడం అసాధ్యం. శరీరం గట్టి కోటలెక్క ఉండాలి. అప్పుడే ఏ వ్యాధి దాడి చేయడానికి వచ్చినా.. ఈజీగా ఎదుర్కోగలుగుతాం. కోట్లు సంపాదించడం కష్టమేమో కానీ, కోట్ల కన్న విలువైన శరీరాన్ని నిర్మించడం మాత్రం చాలా ఈజీ. దానికి పెట్టుబడి కేవలం ఓపిక మాత్రమే! ఓపిక ఉన్నవాళ్లే బద్ధకాన్ని జయిస్తారు. రోజూ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేస్తారు. శరీరాన్ని శక్తివంతంగా నిర్మించుకోవడానికి ఈ నాలుగు ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు రోజూ ట్రై చేయండి!

ప్లాంక్‌‌..

ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లన్నింటిలో ప్లాంక్‌‌ ఒక బెస్ట్ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌.  ప్లాంక్‌‌ చేయడం చాలా సింపుల్‌‌. ప్లాంక్‌‌తో  నడుము, వెన్నెముక, చేతులు బలంగా మారుతాయి. పొట్ట కరిగిపోతుంది.

దాదాపు సెలబ్రిటీలు అంతా రెగ్యులర్‌‌‌‌గా ప్లాంక్ చేస్తుంటారు.

పొట్ట స్ట్రాంగ్‌‌గా ఉండటానికి ఇది హెల్ప్ చేస్తుంది.

రెగ్యులర్‌‌‌‌గా ప్లాంక్ చేయడం వల్ల  బరువు తగ్గి చెక్కిన శిల్పంలా తయారవుతారు అనడంలో డౌటే లేదు.

ఎలా చేయాలి?

ఈ ఎక్సర్‌‌సైజ్‌‌ చేయాలంటే ముందుగా బోర్లా పడుకోవాలి.

మోచేతులు రెండూ సమాంతరంగా నేలకు ఆనించి మోచేతులు, పాదాల
మునివేళ్లపై శరీరాన్ని పైకి లేపాలి.

ఫొటోలో చూపించినట్టుగా శరీరం నేలకు సమాంతరంగా ఉంచాలి.

అప్పుడు ఫోర్స్ మొత్తం పొత్తికడుపు మీద పడుతుంది. ఇలా ఉంచ
గలిగినంత సేపు ఉంచాలి.

ప్లాంక్ విత్‌‌ పుషప్స్‌

పుషప్స్ చేసి.. మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా ప్లాంక్ చేయడం వల్ల పొట్ట ఈజీగా తగ్గుతుంది. ఇలాంటి ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు పొలీస్‌‌ ట్రైనింగ్‌‌లో ఎక్కువగా
కనిపిస్తాయి. ఇలా చేయడం వల్ల ప్లాంక్ శరీరం మీద మరింత ఎఫెక్టివ్‌‌గా పని చేస్తుంది. బరువు తగ్గడంతో పాటు శరీరం బ్యాలెన్స్డ్‌‌గా మారడానికి ఈ ఎక్సర్‌‌‌‌సైజ్ హెల్ప్ చేస్తుంది.

 

ఎలా చేయాలి..

ముందుగా బోర్లా పడుకోవాలి

అర చేతుల మీదనే శరీరాన్ని ఉంచాలి.  తర్వాత సాధ్యమైనంతవరకు పుషప్స్
చేస్తుండాలి.

పుషప్స్ అయిన వెంటనే ప్లాంక్‌‌ పొజిషన్‌‌లో
ఉండగలిగినంతసేపు ఉండాలి.

 

బర్డ్ డాగ్ పోజ్..

ప్లాంక్ పొజిషన్‌‌లోనే పొత్తి కడుపు, వెన్నెముక మీద ఇంకా ఎక్కువ ఫోర్స్ పడాలంటే ఈ బర్డ్‌‌డాగ్‌‌ పోజ్‌‌ని ట్రై చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం బలంగా, బ్యాలెన్స్డ్‌‌గా మారుతుంది. వెయిట్‌‌లాస్‌‌కి ఇది ఎఫెక్టివ్ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌.

ఎలా చేయాలి?

ముందుగా ప్లాంక్ పొజిషన్‌‌లో ఉండాలి.

ఫొటోలో చూపించినట్టుగా ఎడమ చేయి, కుడి కాలుని పైకి లేపి కొద్దిసేపు ఉంచాలి.

తర్వాత కుడి చేయిని, ఎడమ కాలుని పైకి లేపి ఉంచాలి. దీనినే బర్డ్ డాగ్ పోజ్ అంటారు.

ప్లాంక్ విత్‌‌ షోల్డర్ టచ్‌‌

ప్లాంక్ పొజిషన్‌‌లో ఉండి షోల్డర్‌‌‌‌ టచ్ చేయడం వల్ల పొట్ట, వెన్నెముక, షోల్డర్స్ బలంగా మారుతాయి. ఆరు పుషప్స్, తర్వాత ఆరు సార్లు షోల్డర్స్ టచ్‌‌, మళ్లీ ఆరు పుషప్స్‌‌, తర్వాత ఆరుసార్లు షోల్డర్‌‌‌‌ టచ్ చేసి.. చివరికి ఉండగలినంత సేపు ప్లాంక్‌‌లో ఉంటే చాలా ఎఫెక్టివ్‌‌గా పని చేస్తుంది.

 

ఎలా చేయాలి?

ముందుగా ప్లాంక్ పొజిషన్‌‌లో అరచేతులు, పాదాల మునివేళ్ల మీద నిలబడాలి.

కుడి చేతితో ఎడమ భుజాన్ని టచ్ చేయాలి.ఎడమ చేతి మీద నిలబడి కుడి భుజాన్ని టచ్ చేయాలి.

ఇలా సాధ్యమైనన్ని షోల్డర్ టచ్‌‌లు చేయాలి.

ఎక్సర్​సైజ్ చేయాల్సిందే

సాధారణంగా ఆడవాళ్లు  మెనోపాజ్​లో  52 ఏళ్లకి ఎంటర్​ అవుతారు. కానీ, ఈ మధ్య కాలంలో  మెనోపాజ్​ లక్షణాలు ఓ పదేళ్ల ముందే కనిపిస్తున్నాయి.  పెల్విక్​, ఒవేరియన్​ డ్యామేజ్​ వల్ల ఈమధ్య  ఆడవాళ్లు 39 నుంచి 45 ఏళ్ల  వయసులో మెనోపాజ్​లో అడుగుపెడుతున్నారు. పైగా వీళ్లలో మెనోపాజ్​ సింప్టమ్స్​ తీవ్రత ఎక్కువగా ఉంటోందని చాలా స్టడీలు చెప్తున్నాయి.  ఈ దశలో ఆడవాళ్లు  విపరీతమైన కోపం, చిరాకు, ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా చాలా సర్వేలు చెబుతున్నాయి. అయితే ఫిజికల్​ యాక్టివిటీ పెద్దగా లేనివాళ్లకు  మెనోపాజ్​ దశకు త్వరగా చేరుకుంటారు. వీళ్లలో మెనోపాజ్​ తీవ్రత ఎక్కువగా ఉంటుందని రీసెంట్​గా జరిపిన ఓ ఆన్​లైన్​ రీసెర్చ్​లో తేలింది. ‘ది జర్నల్​ ఆఫ్ ది నార్త్​ అమెరికన్​ మెనోపాజ్​ సొసైటీ’ రీసెంట్​గా  మెనోపాజ్​ దశ గురించి ఆన్​లైన్​లో ఓ స్డడీ చేసింది. ఈ స్టడీ ప్రకారం ఫిజికల్​ యాక్టివిటీ లేని ఆడవాళ్లలో మెనోపాజ్​ తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది.  ఈ స్టడీలో  మెనోపాజ్​ దశలో ఉన్న  300 మంది ఆడవాళ్లు  పార్టిసిపేట్​ చేశారు. వీళ్లంతా ఫిజికల్​గా ప్రతిరోజూ యాక్టివ్​గా ఉండేవాళ్లే. వీళ్లందరిలో  మెనోపాజ్​ లక్షణాలు తక్కువగా ఉన్నట్టు తేలింది. కొందరిలో అయితే పీరియడ్స్​ ఆగిపోవడం మినహాయించి మరెలాంటి  లక్షణాలు కనిపించలేదట కూడా. అందువల్ల మెనోపాజ్​ దశలో ఉన్నవాళ్లు ప్రతిరోజూ ఎక్సర్​సైజ్​లు చేయడం మంచిదంటున్నారు రీసెర్చర్​లు.

for more News…