మీ ఫోన్ పోయిందా.? అయితే డోంట్ వర్రీ

మీ ఫోన్ పోయిందా.? అయితే డోంట్ వర్రీ

ఎంత ఇష్టపడి., కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న మొబైల్ పోయిందంటే ఆ బాధ వర్ణనాతీతం. అయితే  ఇకపై అలాంటి బాధ పడాల్సిన అవసరం లేదంటోంది కేంద్ర టెలికాం విభాగం. పోగోట్టుకున్న మొబైల్ ఫోన్లను ఈజీగా ట్రాక్ చేయవచ్చని తెలిపింది. మొబైల్ ఫోన్ చోరీకి గురైనప్పుడు.. ఫోన్ ను దొంగలించిన వారు అందులో ఉన్న సిమ్ ను తీసేసినా.., ఫోన్ యొక్క IMEI నంబర్ ను మార్చేసినా ఆ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చట.  అప్పుడు వేరే ఇంకెవరి చేతిలో పడినా.. ఆ ఫోన్ పనిచేయకుండా పోతుంది. ట్రాకింగ్ ద్వారా ఆ ఫోన్ ఎక్కడున్నది తెలిసిపోతుంది.  ఈ సదుపాయం సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) అనే కొత్త టెక్నాలజీ ద్వారా వచ్చె నెల నుంచి అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీని మహారాష్ట్రలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా సత్ఫలితాలనిచ్చింది. దీంతో డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్(DOT)…  దేశ వ్యాప్తంగా CEIR సేవలను విస్తరించాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వచ్చే నెలలో ఈ సేవలను ప్రారంభించనున్నారు.