మూసీ బ్యూటిఫికేషన్ .. నిరాశ్రయులకు డబుల్ బెడ్​రూమ్​ఇండ్లు

మూసీ బ్యూటిఫికేషన్ ..   నిరాశ్రయులకు డబుల్ బెడ్​రూమ్​ఇండ్లు

మూసీ నది డెవలప్​మెంట్, బ్యూటిఫికేషన్​పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​పెట్టింది. ఉన్నతాధికారులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో హైదరాబాద్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి ముందుగా మూసీ బ్యూటిఫికేషన్ పైనే మాట్లాడుతున్నారు. పనులను వేగవంతం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) కూడా సంబంధిత ప్రక్రియను స్పీడప్ చేసింది

మూసీ బ్యూటిఫికేషన్ లో భాగంగా బఫర్ జోన్ లో ఇండ్లు కోల్పోయే నిరాశ్రయులకు డబుల్ బెడ్​రూమ్​ఇండ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై గత నెలలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి హౌసింగ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గ్రేటర్ సిటీలో నిర్మించిన డబుల్ బెడ్​రూమ్​ఇండ్లు ఎన్ని, లబ్ధిదారులకు కేటాయించినవి ఎన్ని, ఇంకెన్ని ఖాళీగా ఉన్నాయనే వివరాలు తెలుసుకున్నారు. 

లబ్ధిదారులకు ఇవ్వకుండా దాదాపు 30 వేల ఇండ్లు ఉన్నట్టు.. వాటిలో కొన్ని పనులు చేస్తేనే అప్పగించేందుకు వీలవుతుందని అధికారులు చెప్పారు. ఆ పనులకు మూసీ బ్యూటిఫికేషన్ కోసం తీసుకొచ్చే లోన్ పైసలు వాడాలని సర్కార్ నిర్ణయించింది. మూసీ బ్యూటిఫికేషన్​పనుల కంటే ముందు ఇండ్ల ప్రక్రియను అధికారులు పూర్తిచేయనున్నారు.