రూ.3.65 లక్షల కోట్లు పెట్టుబడులకు రెడీ

రూ.3.65 లక్షల కోట్లు పెట్టుబడులకు రెడీ

న్యూఢిల్లీ: ప్రొడక్షన్​ లింక్డ్‌ ఇన్సెంటివ్స్​(పీఎల్ఐ) పథకాల ద్వారా రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి 741 దరఖాస్తులు వచ్చాయని డిపార్ట్​మెంట్​ ఫర్​ ప్రమోషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​ (డీపీఐఐటీ) సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ ప్రకటించారు. మొత్తం 14 పీఎల్​ఐ పథకాల కోసం ఈ దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటికే రూ.1.03 లక్షల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. 

ఈ కంపెనీల అమ్మకాల విలువ ఇప్పటికే సుమారు రూ.8.6 లక్షల కోట్లకు చేరుకుంది. దాదాపు 6.78 లక్షల మందికి ఉపాధి దొరికింది. ఇన్సెంటివ్స్​ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రూ.2,900  కోట్లు మాత్రమే ఇచ్చామని ఆయన చెప్పారు. తదనంతరం ఈ ప్లాన్‌‌ని ఇతర రంగాలకు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు.