అమెరికాలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం

అమెరికాలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం

అమెరికాలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని మేరిల్యాండ్ సబర్డ్ లో 19 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా నామకరణం చేశారు. ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అమెరికాలోని ఇండియన్లు, అమెరికా వెలుపలి భారతీయలు, ఇతర దేశాల నుంచి సుమారు 500 మంది హాజరయ్యారు. 

అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సమయంలో భారీ వర్షం కురిసింది. అయినా ఎంతో ఉత్సాహంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రామ్ సుతార్ తయారు చేశారు. ఈయన గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తయారు చేశారు.