బార్డర్​లో చైనా కొత్త ఎత్తు

బార్డర్​లో చైనా కొత్త ఎత్తు
  • ముందు గా సోల్జర్లను వెనక్కి తీసుకుం దామన్న మన ఆర్మీ
  • అన్నీ దశలవారీగా, పక్కాగా జరగాల్సిం దేనని స్పష్టీకరణ
  • చైనా మాట విం టే డేంజర్ అంటున్న నిపుణులు
  • మన కన్నా ఫాస్ట్ గా ఎల్ఏసీకి బలగాలను తరలించేందుకు చాన్స్

న్యూఢిల్లీతూర్పు లడఖ్​లో ఎల్ఏసీని ఆక్రమించేందుకు కాచుకు కూర్చున్న డ్రాగన్ కంట్రీ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. బార్డర్ గొడవను పరిష్కరించుకునేందుకు జరుగుతున్న చర్చల్లో వింత వాదనలు చేస్తోంది. ముందుగా.. ఎల్ఏసీ వెంబడి ఎత్తైన ప్రాంతాల్లో మోహరించిన ఆర్టిలరీ (ఫిరంగులు), యుద్ధ ట్యాంకులను కిందకు దించుదామని, ఆ తర్వాతే బలగాలను వెనక్కి తీసుకుందామంటూ ప్రపోజల్ పెడుతోంది. అయితే, చైనా మాట వింటే మొదటికే మోసం వస్తుందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లైన్ ఆఫ్​ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద ఉన్న పాంగాంగ్ సో సరస్సుకు నార్త్ వైపు ఉన్న గోగ్రా హాట్ స్ప్రింగ్స్ పర్వతాలను చైనా ఆక్రమించుకుంటే.. సౌత్ లో ఉన్న రెజాంగ్ లారెచిన్ లా రిడ్జ్ లైన్ పర్వతాలను మన దేశం ఆక్రమించుకుంది. బార్డర్ వెంబడి కీలకంగా ఉన్న ఇతర ఎత్తైన ప్రాంతాల్లోనూ మన ఆర్మీ ఫిరంగులు, ట్యాంకులతో సహా మోహరించింది. దీంతో చైనా తనకు అడ్వాంటేజీగా ఉండేటట్లు కొత్త ఎత్తులు వేస్తున్నట్లు చెప్తున్నారు. లడఖ్​లో బార్డర్ గొడవపై డిప్లమాటిక్ లెవెల్​లో జరుగుతున్న చర్చలు ముందుకు సాగడం లేదు. వీటికి సంబంధించిన వివరాలు కాన్ఫిడెన్షియల్​గా ఉంచుతున్నారు. అయితే ఆర్మీని కిందకు దించడం, వెనక్కి తీసుకోవడాన్ని దశలవారీగా, పక్కాగా చేపడదామని మన దేశం చేస్తున్న ప్రపోజల్​కు చైనా ఒప్పుకోవడం లేదని ఆర్మీ సీనియర్ ఆఫీసర్లు చెప్తున్నారు.

ఒప్పుకుంటే డేంజర్

లడఖ్ లో 1,597 కిలోమీటర్ల పొడవున ఉన్న ఎల్ఏసీ వెంబడి చైనా తన భూభాగంలో ఇప్పటికే భారీ ఎత్తున రోడ్లను నిర్మించుకుంది. దీంతో ఎల్ఏసీ వద్దకు మన బలగాల కంటే ఫాస్ట్​గా చైనా తన బలగాలను పంపేందుకు చాన్స్ ఉంది. అందుకే.. ఎత్తైన ప్రాంతాల్లో మోహరించిన ఫిరంగులు, ట్యాంకులను కిందకు దించి.. బలగాలను వెనక్కి తీసుకుంటే.. ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకంటే ముందుగా ఎల్ఏసీని ఆక్రమించుకోవచ్చని చైనా ప్లాన్ వేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ముందు నాటికి ఉన్న పొజిషన్ లోకి ఇరుదేశాల ఆర్మీలు వెళ్లాలని మన దేశం స్పష్టం చేస్తోంది. అలాగే బలగాల ఉపసంహరణ రెండు దేశాల పర్యవేక్షణలో పక్కాగా వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా జరగాలని చెప్తోంది. ఇది సజావుగా జరిగితేనే ఎత్తైన ప్రాంతాల నుంచి కిందికి దిగుదామని పట్టుబడుతోంది.

ట్రంప్ ఓడితే.. చైనా దూకుడు? 

బార్డర్ గొడవపై రక్షణ రంగ నిపుణులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. చైనా దూకుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆధారపడి ఉండొచ్చని కొందరు చెప్తున్నారు. వచ్చే నెల 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ ఓడిపోతే.. ఇరుదేశాల మధ్య 3,488 కిలోమీటర్ల పొడవున ఉన్న ఎల్ఏసీ వెంబడి చైనా దూకుడు పెంచొచ్చని కొందరు అంటున్నారు. మరికొందరేమో.. అమెరికా ఎన్నికల కంటే చాలా రోజుల ముందే చైనా ఆక్రమణకు తెగించినందున.. ఆ ఎన్నికలకు, చైనా తీరుకు సంబంధం లేదని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 2న లడఖ్​మ్యాపును రిలీజ్ చేసినందున.. దానికి ప్రతీకారంగా 1959, నవంబర్ 7 నాటికి ఉన్నట్లుగా ఎల్ఏసీలో మనను వెనక్కి నెట్టాలన్నది డ్రాగన్ కంట్రీ ఆలోచన అని చెప్తున్నారు. కరోనా వ్యాప్తి, అంతర్గత రాజకీయ అంశాలు, ఎకానమీ పతనం వంటి కారణాలతోనే చైనా బార్డర్ లో గొడవకు దిగిందన్న వాదనలూ కరెక్ట్ కాదని భావిస్తున్నారు. చైనాకు అంతర్గత రాజకీయాల్లో ఇబ్బంది ఉండదని, కానీ ఎల్ఏసీలో ఎప్పటికప్పుడు ఆక్రమణలకు మాత్రం తెగిస్తుందని అంచనా
వేస్తున్నారు.