మాల్దీవుల్లో యోగా డే భగ్నం

మాల్దీవుల్లో యోగా డే భగ్నం

అంతర్జాతీయ యోగా డేను భారతదేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు, సెల్రబెటీల వరకు యోగా డేలో పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కానీ.. యోగా డేను కొంతమంది యువకులు భగ్నం చేశారు. జెండాలు చేతబూని యోగా నిర్వహిస్తున్న స్టేడియంలోకి ప్రవేశించారు. దీంతో యోగా చేసేందుకు వచ్చిన వారు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన మయన్మార్ లో చోటు చేసుకుంది. ఇక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటారనే సంగతి తెలిసిందే. రాజధాని మాలేలోని ఓ స్టేడియంలో భారత ఎంబసీ యోగా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

యోగా నిర్వహించేందుకు సిద్ధ పడుతుండగా.. కొంతమంది యువకులు స్టేడియంలోకి చొచ్చుకుని వచ్చారు. యోగా ఇస్లాంకు వ్యతిరేకం అంటూ రాసి ఉన్న ప్ల కార్డులు పట్టుకుని... జెండాలు చేతబూని భయబ్రాంతులకు గురి చేశారు. భారత దౌత్య సిబ్బంది, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర అధికారుల యోగాను అడ్డుకున్నారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు మాల్దీవుల అధ్యక్షులు ఇబ్రహిం మహ్మద్ సోలిహ్. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు, బాధ్యులను చట్టం ముందు నిలబెడుతామని హామీనిచ్చారు.