ఉపాధి హామీ వర్క్ ఫైల్ కంప్లీట్ చేయండి : శ్రీనివాస్ కుమార్

ఉపాధి హామీ వర్క్ ఫైల్ కంప్లీట్ చేయండి : శ్రీనివాస్ కుమార్

కమలాపూర్, వెలుగు: ఉపాధి హామీ వర్క్​ఫైల్​ను కంప్లీట్​చేయాలని డీఆర్డీఏ శ్రీనివాస్ కుమార్ సూచించారు. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె.బాబుతో కలిసి మాట్లాడారు. 

కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఉపాధి హామీలో జరుగుతున్న పనులపై ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశమున్నందున ప్రతి గ్రామంలో ఉపాధి హామీకి సంబంధించిన వర్క్ ఫైల్ పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.