ATM సెంటర్ లోకి స్కూటర్.. వీడికి స్పెషల్ భారత రత్న అవార్డ్ ఇవ్వాలి

ATM సెంటర్ లోకి స్కూటర్.. వీడికి స్పెషల్ భారత రత్న అవార్డ్ ఇవ్వాలి

ఇటీవలి కాలంలో ఈజీ అండ్ ఫాస్ట్ పాలసీకి అందరూ మెల్లమెల్లగా అలవాటు పడుతున్నారు. అన్నీ చేతి దగ్గరికే రావాలనే కోరికను కలిగి ఉంటున్నారు మరికొంతమంది. ఈ పరిణామాలన్నింటినీ రుజువు చేస్తూ ఇప్పుడు ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఓ వ్యక్తి ఏటీఎంలో డబ్బును విత్ డ్రా చేసుకోవడం కనిపిస్తుంది. ఇందులో విచిత్రమేమిటంటే.. అతను ఏటీఎం బూత్ వెలుపల తన స్కూటర్ ను నిలిపివేయకుండా.. నేరుగా స్కూటర్ తోనే ఏటీఎంలోకి వెళ్లి నగదను డ్రా చేస్తూ కనిపించండం విస్మయానికి గురి చేస్తోంది.

మైక్రో-బ్లాగింగ్ సైట్ 'X'లో @dekhane_mukul అనే యూజర్ షేర్ చేసిన ఈ పాత ఫొటో ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ వ్యక్తికి ప్రత్యేక భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ ఈ ఫొటోకు ఆ యూజర్ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ చిత్రంలో చెక్డ్ షర్ట్, ప్యాంటు ధరించిన ఆ వ్యక్తి తన స్కూటర్‌ను నేరుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ATM బూత్‌లోకి పోనిచ్చినట్లు కనిపించింది. వాహనంపై కూర్చుని, అతను అప్రయత్నంగా బూత్ వైపు వెళ్లి, తన లావాదేవీని తెలివిగా నిర్వహించాడు.

ఈ ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు పలు ఫన్నీ కామెంట్లు విసిరారు. థియేటర్లలో నడపండి, రెస్టారెంట్లలో నడపండి! ATMలలో డ్రైవ్ చేయండి... కొత్త ట్రెండ్ అని కొందరు, అతనికి ATM రత్న అవార్డు ఇవ్వాలని ఇంకొందరు, సౌకర్యాలను వినియోగించుకోవడంలో అతనికి నోబెల్, డ్రైవింగ్‌లో ఆస్కార్ ఇవ్వాలని మరికొందరు సరదా కామెంట్లు చేశారు.