డ్రైవింగ్ టెస్ట్ 59 సార్లు ఫెయిలై.. రికార్డు కొట్టిండు

డ్రైవింగ్ టెస్ట్ 59 సార్లు ఫెయిలై.. రికార్డు కొట్టిండు

లండన్: లైసెన్స్ లేకుండా బండి తీస్తే పోలీసులతో పరేషాన్. ఫైన్​లూ కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందు కని ఇంగ్లండ్​లోని వొర్సెస్టర్ షైర్ కౌంటీకి చెందిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని డిసైడ్ అయిండు. రూల్స్ ప్రకారం ఫాలో అయిదమని లెర్నింగ్ లైసెన్స్​కు అప్లయ్ చేసి స్లాట్ బుక్ చేస్కున్నడు. ట్రాన్స్​ఫోర్ట్ ఆఫీస్​లో టెస్ట్​కు అటెండ్ అయిండు.

ఫైనల్​గా ఫెయి లైనవ్ అని ఆఫీసర్లు చెప్పేసరికి.. మూడ్రోజులాగి ఇంకోసారి టెస్ట్ రాసిండు. మళ్లీ ఫెయిల్. అయినా అతడు డిసప్పాయింట్ కాలే. అట్ల 59 అటెంప్ట్ ల తర్వాత 60 వ సారి గట్టెక్కిండు. ఒక్కో టెస్ట్​కు ఒక్కో గంట చొప్పున మొత్తం 60 గంటలు పరీక్ష రాసినోడిగా రికార్డు కొట్టిండు. యూకేలోనే ఇది ఆల్ టైం రికార్డు అని, ఇన్నిసార్లు ఎవరూ అటెంప్ట్ చేయలేదని అధికారులు తెలిపారు.