
- ముంబై, బెంగళూరు నుండి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మకం
- బంజారాహిల్స్ లో పట్టుపడిన ఇద్దరు నిందితుల వద్ద భారీగా దొరికిన డ్రగ్స్
హైదరాబాద్: మహానగరంలో మరోసారి డ్రగ్స్ దందా బట్టబయలైంది. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 10 లో ఒక ఇంటిపై విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ ఇంట్లో ఉన్న ఇద్దరు నిందితులు నైజీరియన్ దేశస్థుడి వద్ద నుంచి మత్తు పదార్థాలు కొనుగోలు చేసి దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ చేశారు. వీరి వద్దనుండి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
వీరు ఒక్క గ్రామ్ కొకైన్ ను 8000 కు అమ్ముతున్నట్లు గుర్తించారు. వీరి వద్ద O 17 గ్రాముల కొకైన్ తో పాటు, 8 గ్రాముల ఎం డి ఎం ఏ, 73 ఎస్టకి పిల్స్, 15 గ్రాముల చరాస్ స్వాధీనం చేసుకున్నారు. ఈజ అనే నైజీరియన్ దేశస్తుడి డ్రగ్స్ అబ్దుర బాబు, సొలమన్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాల నుండి డ్రగ్స్ తీసుకొచ్చిన ఈ ఇద్దరు యువకులు హైదరాబాదులో అమ్ముతున్నట్లు గుర్తించారు.