హైదరాబాద్ లో మ‌రో డ్రగ్స్ ముఠా పట్టివేత

హైదరాబాద్ లో మ‌రో డ్రగ్స్ ముఠా పట్టివేత

హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తార్నాకలో ఇద్దరు నైజీరియన్లను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్ ‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 104గ్రాముల కొకైన్‌, లక్షా 64వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలు అమ్ముతున్న జోడి పాస్కెల్‌ అతని  ప్రియురాలు మోనికలను అరెస్టు చేశారు.

పరారీలో మరో ముగ్గురు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం మోనిక, ముంబయి నుంచి హైదరాబాద్‌ కు డ్రగ్స్‌ ను సరఫరా చేసినట్లు తెలుస్తోంది. జోడిపాస్కెల్‌, మోనిక తార్నాకలోని నాగార్జున కాలనీలో నివాసముంటున్నారు. తార్నాక కూడలి వద్ద ఇద్దరిని ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంటు అధికారులు అరెస్టు చేశారు.