ముంబాయిలో డ్రగ్స్ మూఠా గుట్టురట్టు

ముంబాయిలో డ్రగ్స్ మూఠా గుట్టురట్టు

ముంబాయి, గుజరాత్ లో 120 కోట్లకు పైగా విలువ గల డ్రగ్స్ ను NCB అధికారులు సీజ్ చేశారు. 60 కేజీల హై క్వాలిటీ మెఫెడ్రోన్ ను సీజ్ చేసినట్లు ఎన్సీబీ DDG ఎస్కే సింగ్ తెలిపారు. అయితే పట్టుబడిన డ్రగ్స్ వెనుక ఎయిరిండియా మాజీ పైలట్ ఉన్నట్లు SK సింగ్ తెలిపారు.

డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారులుగా సోహైల్ గఫ్పార్, మిథి పిచైదాస్ లను గుర్తించామన్నారు. సోహైల్ 2016 నుంచి 2018వరకు ఎయిరిండియా పైలట్ గా పనిచేసినట్లు వెల్లడించారు. ఈ ముఠా ఇప్పటి వరకు 225 కేజీల ఎండీని మార్కెట్ లో విక్రయించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.