ఒకటే బీరు తాగాను.. ఇదంతా ఎందుకు

ఒకటే బీరు తాగాను.. ఇదంతా ఎందుకు

వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ మందుబాబు ఓవరాక్షన్ చేశాడు. బ్రీత్ అనలైజర్ లో ఊదమని చెబితే పై పైనే ఊది తాగలేదని బుకాయించాడు. పోలీసులు గట్టిగా బెదిరిస్తే ఒకటే బీరు తాగాను దానికి ఇదంతా ఎందుకు అని హల్ చల్ చేశాడు. ఎన్ని సార్లు చెప్పినా ఊదక పోవడంతో కారుతో సహా అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకముందు బార్ అండ్ రెస్టారెంట్ లో గొడవ చేశాడు మందుబాబు. తింటున్న ఫుడ్ లో స్టాప్లర్ పిన్ వచ్చిందని బార్ యజమానితో ఘర్షణకు దిగాడు. నానా హంగామా సృష్టించి బిల్లు కట్టకుండా బయటకు వచ్చాడు. చివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడ్డాడు.