ఫుల్లుగా తాగి.. టైరు లేకుండానే కారు నడిపాడు

ఫుల్లుగా తాగి.. టైరు లేకుండానే కారు నడిపాడు

టైరు పంక్చర్ అయిన కారుతో కొద్ది దూరం వెళ్లడమే కష్టం.. కానీ, ఓ వ్యక్తి అసలు టైరే లేకుండా కారు నడిపేశాడు. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. పోలీసులు ఆపే వరకు అతడికి టైరు లేకుండా కారు నడుపుతున్న విషయం కూడా అతడికి తెలియలేదు. అంత ఫుల్లుగా మద్యం తాగి ఉన్నాడు. యూకేలో జరిగిన ఈ ఘటనను అక్కడి పోలీసులే ట్వీట్ చేశారు.

ఫుల్లుగా మందు కొట్టి కనీసం కారుకి టైరు ఉందో లేదో కూడా తెలియని స్థితిలో కారు నడిపిన వ్యక్తిని యూకేలోని సౌత్ యార్క్ షైర్ పోలీసులు అరెస్టు చేశారు. డ్రంకెన్ డ్రైవ్ చేయడమే కాదు.. అతడి లైసెన్స్ కూడా గడువు ముగిసిందని పోలీసులు చెప్పారు. ఇన్సూరెన్స్ కూడా లేదు. గతంలో రెండు సార్లు కోర్టు వాయిదాలకు రాకుండా జంప్ కొట్టాడు. అతడికి కేవలం డ్రంకెన్ డైవింగ్ కేసులోనే భారీ జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు. అలాగే ఏడాది పాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధిస్తామని చెప్పారు.