ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా దృశ్యం

ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా దృశ్యం

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన దృశ్యం మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో.. జీతూ జోసఫ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాను సౌత్ లో ఉన్న అన్నీ లాంగ్వేజెస్ లో రీమేక్ చేసారు. రీమేక్ అయిన అన్ని భాషల్లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రికార్డ్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక దృశ్యం సినిమాకి సీక్వెల్ గా దృశ్యం2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా అనూహ్య విజయాన్ని సాదించింది. తెలుగులో ఈ రెండు సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్లుగా త్రిల్ చేసింది. 

అయితే ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. అదేంటంటే ఇప్పుడు ఈ సినిమా కొరియా భాషలో రీమేక్ కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో, కొరియాలో రీమేక్ కాబోతున్న తొలి ఇండియన్ సినిమాగా దృశ్యం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాని కొరియాలో ప్రముఖ ఇండియన్‌ నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్‌, దక్షిణ కొరియాకు చెందిన ఆంథాలజీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

పారాసైట్ మూవీ హీరో సాంగ్ కాంగ్-హో ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దృశ్యం సినిమా ఫ్యాన్స్ కొరియాలో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా కొరియాలో ఎప్పుడు రిలీజ్ కానుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.