SIP News: రూ.10వేల పెట్టుబడిని రూ.కోటిగా మార్చిన ఫండ్, మీరూ సిప్ చేస్తున్నారా..?

SIP News: రూ.10వేల పెట్టుబడిని రూ.కోటిగా మార్చిన ఫండ్, మీరూ సిప్ చేస్తున్నారా..?

DSP Flexi Cap Mutual Fund: చాలా మంది పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్స్ వల్ల ప్రయోజనాలు, అవి ఎలా తమ లక్ష్యాలను చేరుకోవటంలో దోహదపడతాయనే విషయాలను ఇటీవలి కాలంలో అర్థం చేసుకుంటున్నారు. అందుకే కరోనా తర్వాత ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పెరగటంతో చిన్న ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీ మార్కెట్లలోకి రావటం అలాగే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టడం వంటివి పెంచారు. అయితే క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టేవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారనేది మరోసారి రుజువుచేసింది ఒక ఫండ్.

వాస్తవానికి పెట్టుబడిదారులు విడిగా కొన్ని షేర్లలో పెట్టుబడులను కలిగి ఉండటం కంటే.. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయటం వారికి డైవర్సిఫికేషన్ బెనిఫిట్స్ అందిస్తుంది. అలాగే స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ తో పాటు మరిన్ని పెట్టుబడి కేటగిరీల్లోకి డబ్బును మళ్లించటం వల్ల రిస్క్ తక్కువ అవుతుండటం చాలా మందిని వీటివైపుకు ఆకర్షిస్తోంది. అయితే వీటిలో మంచి రాబడులను చూడాలంటే దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను ఇన్వెస్టర్లు కొనసాగించాల్సి ఉంటుంది. గత చరిత్రను పరిశీలిస్తే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఎల్లప్పుడు దీర్ఘకాలంలో మంచి రాబడులను అందుకున్నట్లు తేలింది. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది డీఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించే. 1997లో ప్రారంభించబడిన ఈ ఫండ్ దాదాపు 28 ఏళ్ల కాలంలో తన పెట్టుబడిదారులకు సగటున 14.5 శాతం వార్షిక రాబడిని అందించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటుకు డబుల్ అలాగే ఇండెక్స్ ఫండ్స్ అందించిన దాని కంటే స్వల్పంగా ఎక్కువగానే ఉంది. స్కీమ్ ప్రారంభించిన నాటి నుంచి ప్రతి నెల రూ.10వేల చొప్పున ఎస్ఐపీని కొనసాగించిన పెట్టుబడిదారులకు స్కీమ్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.91 లక్షల 84వేల 819 రాబడిని తెచ్చిపెట్టింది. 

డీఎస్పీ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గడచిన 10 ఏళ్ల పనితీరును పరిశీలిస్తే.. అద్భుతంగా 15.39 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. అంటే 2015 నుంచి ఎవరైనా ఇన్వెస్టర్ ప్రతినెల ఇందులో రూ.10వేల ఎస్ఐపీ రూపంలో పెట్టుబడిని కొనసాగించినట్లయితే వారు మెుత్తం రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టేవారు. అయితే దాని మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.26 లక్షల 86వేలకు చేరుకుంది. సహజంగా ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తమ పెట్టుబడిని అన్ని రకాల కంపెనీల్లోకి మళ్లిస్తుంటాయి కాబట్టి మార్కెట్ల క్రాష్ వంటి సమయంలో కూడా జరిగే నష్టం తక్కువగా ఉంటుంది.