
జగిత్యాల టౌన్/హుజూరాబాద్, వెలుగు: విద్యార్థి దశ నుండే సైబర్ నేరాల నివారణపై అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ సూచించారు. బుధవారం ఓ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నెంబర్ లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ కరుణాకర్ , సైబర్ క్రైమ్ ఎస్ఐలు కృష్ణ , దినేశ్ పాల్గొన్నారు.