
ప్రపంచవ్యాప్తంగా చాల నగరాల్లో ఎయిర్ టాక్సీలను తీసుకొచ్చేనందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ దుబాయ్ ఇందులో ముందు ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే దుబాయ్ మొదటి ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్ 2026 నాటికి ప్రారంభించడానికి రెడీ అవుతుంది. దింతో దుబాయ్ నగరంలో చాలా వేగమైన ఎలక్ట్రిక్ విమాన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ సర్వీస్ కాలిఫోర్నియా కంపెనీ జాబీ ఏవియేషన్ సృష్టించింది.
సమాచారం ప్రకారం, ఈ ఎయిర్ టాక్సీ నెట్‌వర్క్ నాలుగు వెర్టిపోర్ట్‌ల నుండి పనిచేస్తుంది. ఈ వెర్టిపోర్ట్‌లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇవి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా ఇంకా పామ్ జుమేరా. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటి వెర్టిపోర్ట్ 2026 నాటికీ రెడీ కానుంది. నగరంలోని ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి త్వరగా వెళ్ళడానికి ఈ టాక్సీలను రూపొందించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పామ్ జుమేరాకు కారులో వెళ్ళడానికి 45 నిమిషాలు పట్టేది కానీ ఈ టాక్సీ ద్వారా కేవలం 12 నిమిషాల్లో చేరుకోవచ్చు.
ALSO READ : ఆదాయం సరిపోవట్లేదు.. ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్ల సమ్మె: మొత్తుకుంటున్న ప్రయాణికులు..
బుకింగ్ ఎలా చేసుకోవచ్చు: మొబైల్ యాప్ ద్వారా ఎయిర్ టాక్సీలను ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అది కూడా ఉబర్ యాప్ లాగానే ఉంటుంది. కాబట్టి ప్రజలు ఒకే యాప్ ద్వారా టాక్సీని బుక్ చేసుకోవచ్చు, ప్రయాణించొచ్చు, ఛార్జ్ చెల్లించొచ్చు. తరువాత ఈ సర్వీస్ హోటళ్ళు, ప్రత్యేక ప్రదేశాలకు కూడా విస్తరించనున్నారు.
ఛార్జీ ఎంత అవుతుందంటే: ఛార్జీల గురించి ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ కాండే నాస్ట్ ట్రావెలర్ ప్రకారం, జోబీ ఒక ట్రిప్ కి ఛార్జీ దాదాపు $75 అంటే సుమారు రూ. 6464 ఉంటుందని అంచనా. ఈ ఎయిర్ టాక్సీకి గాజు డోర్స్, పైకప్పు వరకు విండ్ షీల్డ్ ఉంటుంది.
ఎంత మంది కూర్చోవచ్చు: ఈ ఎయిర్ టాక్సీ పై చాల టెస్ట్ లు జరిగాయని జోబీ చెప్పింది. ఈ విమానాలు 60,000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించాయి. అన్ని విమానాలను లైసెన్స్ పొందిన పైలట్లు నడిపిస్తారు. ప్రజలకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తామని కంపెనీ చెబుతోంది. ప్రతి ఎయిర్ టాక్సీలో ఒక పైలట్, నలుగురు ప్రయాణీకులు కూర్చోవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లు ఉంటుంది.