దుబాయ్‌లో కొత్త హిందూ దేవాలయం ప్రారంభం నేడే

దుబాయ్‌లో కొత్త హిందూ దేవాలయం ప్రారంభం నేడే

దుబాయ్ లో కొత్త హిందూ దేవాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. జబెల్ అలీలోని దుబాయ్ కారిడార్ ఆఫ్ టాలరెన్స్ లో నిర్మించిన ఈ ఆలయాన్ని దసరా సందర్భంగా ఓపెన్ చేయాలని నిర్వాహకులు భావించారు. ఈ నేపథ్యంలో నేడు ఈ గుడిని తెరవనున్నారు. అయితే ఈ రోజు ఆలయం సందర్శనం కేవలం ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే అని, అక్టోబర్ 5 అంటే రేపు, దసరా రోజులన వచ్చే భక్తులకు మాత్రం ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఇంతకు మునుపే నిర్వాహకులు ప్రకటించారు. మరింత సమాచారం కోసం http://hindutempledubai.com ను సందర్శించవచ్చని తెలిపింది. అయితే ఈ ఆలయంలో మొత్తం 16మంది హిందూ దేవతలను ప్రతిష్టించినట్టు తెలుస్తోంది. ఆలయంలో వివాహాలు, ప్రైవేటు ఈవెంట్లు చేయడానికి తగిన సౌకర్యాలనూ నిర్వాహకులు కల్పించారు.

వీటితో పాటు ఈ హిందూ దేవాలయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ, నాలెడ్జ్ సెంటర్లలో పెద్దసైజు ఎల్సీడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. ఆలయ తలుపులను వాల్ నట్ తో తయారు చేశారు. దేవతలను నల్ల రాతి నుంచి తయారు చేశారు. ఈ ఆలయంలో వినాయకుడు, శ్రీ కృష్ణుడు, మహాలక్ష్మి, గురువాయురప్న్, అయ్యప్ప లాంటి మొత్తం 15 దేవుళ్లలతో పాటు శివుడు కూడా ఉండడం గమనార్హం. ఇక ఈ ఆలయంలో నిత్యం పూజలందించేందుకు ఎనిమిది మంది పూజారులను నియమించినట్టు సమాచారం.