
లగ్జరీ మోటర్‌సైకిల్ బ్రాండ్ డుకాటి బుధవారం తన సరికొత్త హైపర్‌మోటర్డ్ 950 బైక్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. దీని ధర రూ.11.99 లక్షలుగా(ఎక్స్‌షోరూం ప్యాన్ ఇండియా) పేర్కొంది. అన్ని డుకాటి డీలర్‌షిప్‌ల వద్ద ఈ బైక్ బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. 937సీసీ ట్విన్ సిలిండర్ డుకాటి టెస్టారెర్టా 11 డిగ్రీ ఇంజిన్‌తో దీన్ని రూపొందించింది. ఈ బైక్ అత్యధిక మైలేజీని ఇస్తుందని కంపెనీ చెప్పింది.