ఐసీసీ తప్పిదం..టెస్టుల్లో భారత్ నెం.1 ర్యాంకు మాయం

ఐసీసీ తప్పిదం..టెస్టుల్లో భారత్ నెం.1 ర్యాంకు మాయం

టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం సాధించిందన్న  ఆనందాన్ని ఐసీసీ ఆవిరి  చేసింది. టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుందని భారత అభిమానులు సంబరాలు చేసుకోగా..ఐసీసీ ఒక్కసారిగా వాటిని నీరుగార్చింది. టెస్టుల్లో భారత జట్టు టాప్ 1 స్థానాన్ని దక్కించుకోలేదని స్పష్టం చేసింది. ఐసీసీ అధికారిక వెబ్ సైట్లో సాంకేతిక సమస్యతోనే  భారత్ నెంబర్ స్థానంలో కనిపించిందని వెల్లడించింది. 

మారిన లెక్కలు..

ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ ఆధారంగా టెస్టుల్లో టీమిండియా 115 పాయింట్స్‌తో అగ్రస్థానానికి చేరుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 111 పాయింట్స్‌తో రెండో స్థానంలో నిలిచినట్లు ఐసీసీ వెబ్ సైట్ లో కనిపించింది. దీంతో అన్ని ఫార్మాట్లలో భారత్ నెంబర్ జట్టుగా అవరించిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సంతోషం ఎక్కువ సేపు మిగల్లేదు. కొద్దిసేపటి తర్వాత టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియానే నెంబర్ వన్ గా దర్శనమిచ్చింది.  126 పాయింట్స్‌తో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ..115 పాయింట్స్‌తో , భారత్  రెండో స్థానంలో ఉన్నట్లు కనిపించింది. అయితే ఈ కన్‌ఫ్యూజన్ టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగిందని ఐసీసీ పేర్కొంది.