కరోనాతో ఇంట్లోనే ఫేషియల్, హెయిర్ ప్యాక్‌‌‌‌లు

కరోనాతో ఇంట్లోనే ఫేషియల్, హెయిర్ ప్యాక్‌‌‌‌లు
ఆన్‌‌‌‌లైన్ స్టోర్లలో బ్యూటీ ప్రొడక్ట్‌‌‌‌లకు డిమాండ్ ట్రిమ్మర్స్‌‌‌‌, షేవింగ్ కిట్స్ సేల్స్ ఎనిమిదింతలు పెరిగాయ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్, వెలుగు: కరోనా మహమ్మారి ఇళ్లనే సెలూన్లుగా మార్చేసింది. చాలా మంది మహిళలు, పురుషులు తమ హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, స్కిన్‌‌‌‌‌‌‌‌ను హెల్తీగా ఉంచుకోవడం కోసం ఇంటి వద్దనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మర్చిపోయిన హోమ్ రెమిడీస్‌‌‌‌‌‌‌‌ను కరోనా మరొక్కసారి గుర్తు చేసింది. ఎవరికి వారే ఫేస్ ప్యాక్‌‌‌‌‌‌‌‌లు వేసుకోవడం, హెయిర్ డ్రెస్ చేసుకోవడం నేర్చుకున్నారు. దీంతో హెయిర్ ప్యాక్‌‌‌‌‌‌‌‌లకు, ఫేస్ ప్యాక్‌‌‌‌‌‌‌‌లకు, డీఐఐ బ్యూటీ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లకు, వ్యాక్స్ ట్రిప్స్‌‌‌‌‌‌‌‌కు, ఎపిలేటర్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరిగింది. ఎవరికి వారే ఫేస్‌‌‌‌‌‌‌‌ ప్యాక్‌‌‌‌‌‌‌‌లను, హెయిర్ ప్యాక్‌‌‌‌‌‌‌‌లను వేసుకోవడానికి  కాస్త టైమ్ పట్టినప్పటికీ.. చాలా మనీ ఆదా అవుతున్నట్టు చెబుతున్నారు. మహిళలు బ్యూటీ పార్లర్ కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తారు. ఒక్కసారి విజిట్ చేస్తే సగటున రూ.12 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంటి వద్దనే చేసుకుంటూ ఉండటం వల్ల ఆ ఖర్చులో కేవలం 10 శాతమే ఇప్పుడు ఖర్చవుతుంది. కరోనాకు భయపడి మహిళలు కూడా ఇంట్లోనే ఉండి  బ్యూటీ ట్రిప్స్ పాటిస్తున్నారు. ఫేషియల్, మేకప్, హెయిర్ కేర్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్లో ఎక్కువగా అమ్ముడుపోయిన ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లుగా ఉన్నట్టు మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కన్సల్టెన్సీ టెక్నోపాక్ అడ్వయిజర్స్ చెప్పింది. ప్రత్యేకంగా పార్లర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాల్సినవసరం రాకుండానే.. తనకు తాను కేర్ తీసుకుంటున్నట్టు మాజీ బ్యాంకర్ సుగంధ సిన్హా చెప్పారు. ఈ సమయంలో కస్టమర్ల సేఫ్టీ విషయంలో అసలు రాజీ పడకూడదని అన్నారు. చాలా మంది మహిళలు పార్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వెళ్లకుండా నైకా వంటి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ స్టోర్లలో బ్యూటీ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను కొంటున్నట్టు చెప్పారు. ఆయుర్వేద లగ్జరీ బ్యూటీ రిటైలర్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ తన ‘మీ టైమ్’ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లకు బాగా డిమాండ్ వచ్చినట్టు చెప్పింది. బాడీ స్క్రబ్స్, లగ్జరీ సోప్స్‌‌‌‌‌‌‌‌ అంతకుముందు కంటే ఎక్కువగా అమ్ముడుపోయినట్టు పేర్కొంది. తమ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఛానల్స్ గత కొన్ని నెలల నుంచి 122 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ను నమోదు చేశాయని కంపెనీ ఎండీ సమ్రత్ బేడి చెప్పారు. ఈ–కామర్స్ సైట్లు ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్, పేటీఎం మాల్, బిగ్‌‌‌‌‌‌‌‌బాస్కెట్, స్నాప్‌‌‌‌‌‌‌‌డీల్ వంటి వాటిల్లో ఏప్రిల్ నుంచి ఎపిలేటర్స్, రేజర్స్, హెయిర్ కలర్ సొల్యుషన్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పెరిగింది. వీటి సేల్స్ ఎగిశాయి. పురుషుల కేటగిరీలో కూడా హెయిర్ ట్రిమ్మర్స్, షేవింగ్ కిట్స్‌‌కు డిమాండ్ బాగా వచ్చింది. కొన్ని ఈ–కామర్స్ సైట్లలో ఎపిలేటర్స్, ట్రిమ్మర్స్ దొరకలేదు కూడా. వేరే ఛాయిస్ లేకపోవడంతో చాలా మంది బ్రాండెడ్ కాని వాటిని  కూడా కొన్నారు. షేవింగ్ కిట్స్, ట్రిమ్మర్స్, హెయిర్ కలర్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ ఎనిమిదింతలు పెరిగినట్టు బిగ్‌‌‌‌‌‌‌‌బాస్కెట్ చెప్పింది. స్నాప్‌‌‌‌‌‌‌‌డీల్‌‌‌‌‌‌‌‌లో పర్సనల్ గ్రూమింగ్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు బాగా అమ్ముడుపోయిన ఉత్పత్తులుగా ఉన్నట్టు పేర్కొంది. ట్రిమ్మర్స్, ఎపిలేటర్స్, హెయిర్ స్ట్రెయిట్‌‌‌‌‌‌‌‌నర్ వంటి గ్రూమింగ్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లకు పేటీఎం మాల్‌‌‌‌‌‌‌‌లో 300 శాతం గ్రోత్ రికార్డయింది. సెలూన్స్ ఇప్పుడు అన్ని తిరిగి ప్రారంభమైనా కూడా ఇన్ని రోజులు జనాలు ఎలా అయితే ఇంట్లోనే హోమ్ టిప్స్ పాటించారో, అలానే కొనసాగిస్తున్నారు. కరోనా నుంచి నేను నేచురోపతి(ప్రకృతి వైద్యం) తీసుకోవడం ప్రారంభించాను. డీఐవై హెయిర్, ఫేస్‌‌‌‌ ప్యాక్‌‌‌‌లను నాకు నేనే వేసుకున్నా. బొప్పాయి, టమాటోలను తీసుకుని ఫేస్‌‌‌‌కు, నెక్‌‌‌‌కి రాసుకున్నా. ఇది క్లీన్సర్‌‌‌‌‌‌‌‌గా ఉపయోగపడింది. హోమ్ మేడ్ ఫేస్‌‌‌‌ ప్యాక్‌‌‌‌లను సిద్ధం చేసుకుని ప్రతి రోజూ అప్లయి చేసుకుంటున్నా. – రష్నా షకీల్ కపాడి, హెడ్ డిజైనర్, క్లబ్ మహీంద్రా   2020లో యావరేజ్‌‌గా ఇండియాలో అమ్ముడుపోయిన బ్యూటీ ప్రొడక్ట్‌‌ల వాల్యు…రూ.1,08,000 కోట్లు                 2019-–-24 మధ్య ఇండియన్ బ్యూటీ, పర్సనల్ కేర్ గ్రోత్.. 6.8%                 70 శాతం ఇండియన్ బ్యూటీ మార్కెట్ మేకప్ ప్రొడక్ట్‌‌లదే                 గత కొన్ని నెలల నుంచి ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌‌ ఆన్‌‌లైన్ సేల్స్ 122 శాతం జంప్                 పేటీఎంపై గ్రూమింగ్, యాన్సిలరీ ప్రొడక్ట్‌‌ల గ్రోత్ 300 శాతం                 కరోనా సమయంలో నైకా సర్వీస్ చేసిన ఆర్డర్లు నెలకు 16 లక్షలు