హైదరాబాద్ ప్రజలకు పోలీస్ శాఖ హెచ్చరిక..

హైదరాబాద్ ప్రజలకు పోలీస్ శాఖ హెచ్చరిక..

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సాయంత్రం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లపై వరద నీరు చేయడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. 

నాచారం, మల్లాపూర్‌, ముషీరాబాద్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, యూసుఫ్‌గూడ, కుత్బుల్లాపూర్‌, తిరుమలగిరి, అల్వాల్‌, బోయినపల్లి, జవహర్‌నగర్‌, బేగంపేట, బొల్లారం, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, తార్నాక, ఓయూ, లాలాపేట, హబ్సీగూడలో భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం అక్కడకక్కడ చిరుజల్లుతో కూడిన వర్షం పడుతోంది. ఈ క్రమంలోనే పోలీసులు ప్రజలకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. 

తెలంగాణ పోలీసుల జాగ్రత్తలు ఇవే.. 

* ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లరాదు.

*  చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు.

* కరెంటు స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు ముట్టుకోవద్దు.

* వర్షం కారణంగా వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల పరిమిత వేగంతో నడపాలి. 

* భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి.

* ఏదైనా ఎమర్జెన్సీ సేవల కోసం జీహెచ్ఎంసీ హైల్ప్ లైన్ నెంబర్లలో 040 21111111, 9000113667 నెంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.