దులీప్ ట్రోఫీ ఫైనల్లో గెలుపు ముంగిట సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌

దులీప్ ట్రోఫీ ఫైనల్లో  గెలుపు ముంగిట సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌

బెంగళూరు: సౌత్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ గెలుపు ముంగిట నిలిచింది. అంకిత్‌‌‌‌‌‌‌‌ శర్మ (99), ఆండ్రీ సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌ (84 నాటౌట్‌‌‌‌‌‌‌‌) కీలక భాగస్వామ్యం నెలకొల్పినా.. సెంట్రల్‌‌‌‌‌‌‌‌ ముందు  సౌత్‌‌ టీమ్ 65 రన్స్ టార్గెట్‌‌ను మాత్రమే ఉంచింది. 129/2 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆదివారం నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌత్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 121 ఓవర్లలో 426 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. దాంతో 64 రన్స్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంలో నిలిచింది. 

రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌ స్మరన్‌‌‌‌‌‌‌‌ (67), రికీ భుయ్‌‌‌‌‌‌‌‌ (45) మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 85 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌ (27), సల్మాన్‌‌‌‌‌‌‌‌ నిజర్‌‌‌‌‌‌‌‌ (12) నిరాశపర్చడంతో సౌత్‌‌‌‌‌‌‌‌ 222/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో  సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌, అంకిత్‌‌‌‌‌‌‌‌ ఆదుకున్నారు. సెంట్రల్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కొన్న ఈ ఇద్దరు ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 192 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేయడంతో ఆ మాత్రం ఆధిక్యం లభించింది. చివర్లో గుర్జప్నీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (3), నిదీశ్‌‌‌‌‌‌‌‌ (0), వాసుకి కౌశిక్‌‌‌‌‌‌‌‌ (0) ఫెయిలయ్యారు.  కుమార్‌‌‌‌‌‌‌‌ కార్తికేయ 4, సారాన్ష్‌‌‌‌‌‌‌‌ జైన్‌‌‌‌‌‌‌‌ 3, దీపక్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ సేన్‌‌‌‌‌‌‌‌ చెరో వికెట్‌‌‌‌‌‌‌‌ తీశారు. సోమవారం ఆఖరి రోజు 65 రన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తే 11 ఏండ్ల తర్వాత దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ టైటిల్‌‌‌‌‌‌‌‌ని సెంట్రల్ జోన్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకుంటుంది.