
అఖిల్ 'హలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ కల్యాణి ప్రియదర్శన్ . ఇప్పుడు ఈ బ్యూటీ ఒక సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మలయాళ చిత్రం పేరు 'లోక', తెలుగులో 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర'గా విడుదలైంది. రొటీన్ కథలకు భిన్నంగా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందా.. లేదా చూద్దాం.?
కథాంశం..
చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) అనే అమ్మాయికి కొన్ని అతీంద్రయ శక్తులుంటాయి. ఈ పవర్స్‌ను దాచిపెట్టుకుని సాధారణ జీవితం గడపడానికి బెంగళూరుకు వస్తుంది. ఒక కేఫ్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమెకు, ఎదురింట్లో ఉండే సన్నీ (నస్లేన్) పరిచయమవుతాడు. ఈ పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో, అనుకోని సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందులవుతుంది. అసలు ఆమె ఎవరు? ఆమె శక్తులకు కారణమేంటి? పోలీస్ ఆఫీసర్ నాచియప్ప (శాండీ)తో ఆమెకు ఉన్న గొడవ ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
యాక్షన్ తో అదరగొట్టిన కల్యాణి
కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో 'చంద్ర' పాత్రలో ఒదిగిపోయింది. సాధారణ కమర్షియల్ పాత్రలకు భిన్నంగా, ఫైట్స్ చేసి తనలోని మరో కోణాన్ని చూపించింది. టైటిల్ పాత్రలో నటించిన కళ్యాణి ప్రియదర్శిని తన హావభావాలను పలికించిన తీరు ఆకట్టుకుంది. ఎమోషనల్ తో పాటు యాక్షన్స్ లోనూ అద్భుతంగా చేసింది. అమాయకమైన ప్రేమలో పడే కుర్రాడిగా నస్లేన్ పాత్ర బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. విలన్ పాత్రలో కొరియోగ్రాఫర్ శాండీ మెప్పించాడు. ఈ చిత్రంలో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్, సౌబిన్ షాహిర్ అతిథి పాత్రల్లో కనిపించి ఆశ్చర్యపరిచారు. అయితే ఫస్టాప్ లో సినిమా కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, రెండో భాగంలో కీలకమైన మలుపులతో ఆసక్తిని రేకెత్తించారు
ALSO READ : అమ్మమ్మ ఆఖరి ప్రయాణంలో కన్నీటి పర్యంతమైన రామ్ చరణ్
రొటీన్ కు భిన్నంగా..
దర్శకుడు డొమినిక్ అరుణ్ ఈ సూపర్ హీరో కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి వర్క్ అద్భుతంగా ఉంది. రెడ్, బ్లూ కలర్స్ ఉపయోగించి ప్రతీ ఫ్రేమ్‌ను రిచ్‌గా చూపించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌కు తగినట్లు ఉంది. మొత్తం మీద, ఇది ఒక కొత్త తరహా సినిమా, సూపర్ హీరో కథలను ఇష్టపడే వారికి నచ్చుతుంది. రెగ్యులర్ రొటీన్ సినిమాలు చూడకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే, 'కొత్త లోక' మంచి ఆప్షన్ అంటున్నారు ప్రేక్షకులు.