
మలయాళ నటుడే అయినా టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం తెలుగు దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆదివారం ఆయన బర్త్‌డే. ఈ సందర్భంగా తన సినిమాల అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో జోష్‌ని నింపాడు దుల్కర్. ప్రస్తుతం తను నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి దుల్కర్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ.. టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి ఆకట్టుకునే లిరిక్స్ రాశారు.
శభాష్ సోదరా.. కాలరెత్తి తిరగరా.. కరెన్సీ దేవి నిను వరించెరా.. తమాషా చూడరా.. నీ గ్రహాలు సరసర.. అదృష్టరేఖపైనే కదిలేరా.. నిన్ను ఆపే వాడే లేడే.. నీదైన కాలం నేడే మొదలురా..’ అంటూ సాగిన పాటను సింగర్ ఉషా ఉతుప్ పాడిన విధానం ఇంప్రెస్ చేసింది. 1980–-90ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బ్యాంక్ క్యాషియర్‌గా దుల్కర్ సల్మాన్ కనిపించనున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది.
మరోవైపు దుల్కర్ హీరోగా కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పవన్ సాధినేని డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకి ‘ఆకాశంలో ఒక తార’ అని టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌లో దుల్కర్ రైతుగా కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచాడు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ మూవీని నిర్మిస్తున్నారు.