బారిష్ పూజ చేస్తే డబ్బులు డబుల్ అవుతాయి : హైదరాబాద్ సిటీ కొత్త మోసం వెలుగులోకి

బారిష్ పూజ చేస్తే డబ్బులు డబుల్ అవుతాయి : హైదరాబాద్ సిటీ కొత్త మోసం వెలుగులోకి

ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మడానికి వీళ్లేదు..అలాగని ఎవర్నీ నమ్మకుండా ఏ పని చేయలేం.. నమ్మితే నట్టేట ముంచుతున్నారు. మనిషికు ఉన్న మూఢనమ్మకాలు, ఈజీగా మనీ సంపాదించాలనే దురాశ.. అత్యాశే మన కొంప ముంచుంది.  మనీ అనే  వీక్ నెస్ ను ఆసరగా చేసుకుని కేటుగాళ్లు  ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా  చేస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచుతున్నారు. 

ఎవరికైనా కష్టపడకుండా డబ్బులు వస్తాయా.? ఈ రోజుల్లో కూడా పూజల పేరుతో డబ్బులు డబుల్ చేస్తామంటే నమ్ముతారా..? హైదరాబాద్ లో  ఇలాంటి పూజలతో డబుల్ డబుల్ చేస్తామని దోచుకుంటున్న ముఠాను  పోలీసులు అరెస్ట్ చేశారు. 

పూజలు (బారిష్ పూజ)చేసి మీ డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నలుగురు(పాత నేరస్తులు) సభ్యుల ముఠాను దుండిగల్ పోలీసులు అక్టోబర్ 27న అరెస్టు చేశారు..వారి నుంచి ఒక ఎయిర్ గన్(పిస్టల్),ఒక కత్తితో పాటు 8 లక్షల 50 వేల నగదును  స్వాధీనం చేసుకున్నారు. 

  అక్టోబర్  18 న దుండిగల్ లోని ఓ ఇంట్లో  పూజ(బారిష్ పూజ)పేరుతో నమ్మబలికి,ప్రసాదంలో మత్తు మందు కలిపి డబ్బు దోచుకెళ్లారు నిందితులు.. వారిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు పోలీసులు. మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకుంటామని  మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.